YS Jagan : మెడికల్ కాలేజీల పరిరక్షణకు పోరాటం

ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణకు ప్రజాపోరాటం ఉదృతం చేస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమంలో సంతకాలు సేకరిస్తామని తెలిపారు.

YS Jagan

అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణకు ప్రజాపోరాటం ఉదృతం చేస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్. జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి జిల్లాల్లో గవర్నమెంటు కాలేజీ ఉండాలన్న సంకల్పంతో అప్పటిదాక ఉన్న 12మెడికల్ కాలేజీలకు అదనంగా క వైసీపీ హయాంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు పెట్టామని తద్వారా అదనంగా 800సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. వాటికి మౌలిక సదుపాయాలు కల్పించి నడిపించాల్సిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ..ప్రైవేటు మెడికల్ విద్యను ప్రోత్సహిస్తుందని జగన్ ఆరోపించారు. మెడికల్ కాలేజీల నిర్వహనకు ఐదేళ్లలో రూ.5వేల కోట్లు పెట్టలేరా? అని చంద్రబాబును ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల విషయమై ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని..ఇందుకోసం .అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని సందర్శిస్తానని తెలిపారు. అక్టోబరు 10 నుంచి నవంబర్‌ 22వరకూ రచ్చబండ కార్యక్రమంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై కరపత్రాలు పంపిణీ చేస్తామని.. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరించడంతో పాటు ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాల సేకరణ చేసి.. ఈ సంతకాలు గవర్నర్‌కు అప్పగించే కార్యక్రమం చేస్తామని జగన్ వివరించారు.

రాష్ట్రంలో లిక్కర్ మాఫియా

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని..రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయని, చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన బినామీల జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయని జగన్ ఆరోపించారు. ఐదేళ్లలో ఎప్పుడూ అలాంటివి లేవని.. ఎరువుల పంపిణీలో కూడా స్కాం చేశారు. దళారీలతో చేతులు కలిపారు?. . ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కల్తీ లిక్కర్‌ మాఫియా నడుస్తోందని..దీని కోసం ప్రభుత్వ దుకాణాలను మూసేశారు. డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను మొత్తం చేతుల్లోకి తీసుకున్నారని జగన్ ఆరోపించారు. ప్రజలు చనిపోయినా పర్వాలేదు, తమ జేబుల్లోకి డబ్బు వస్తే చాలనుకుంటున్నారని మండిపడ్డారు.