అమరావతి : ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార టీడీపీ రెడ్ బుక్ కు కౌంటర్ గా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ బుధవారం డిజిటల్ బుక్ యాప్ ను ఆవిష్కరించారు. టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో వైసీసీ నేతలను, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తుందని ఆరోపించిన మాజీ సీఎం వైఎస్.జగన్..ఇకమీదట ఈ తరహా వేధింపులను డిజిటల్ బుక్ లో నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన డిజిటల్ బుక్ యాప్ లాంచ్ చేశారు.
డిజిటల్ బుక్ పై వైసీపీ నేతలు స్పందిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేసే వీలుందని తెలిపారు. రెడ్‌బుక్ పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేసేవారి పేర్లు అందులో నమోదు చేసే వీలుందన్నారు. రెడ్‌బుక్ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని అందులో నమోదు చేయవచ్చు. అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై కచ్చితంగా విచారణ ఉంటుందని తెలిపారు. అన్యాయం చేసిన వారు ఎక్కడున్న సరే.. తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే చర్యలు ఉంటాయని జగన్ చెప్పారు’’ అని వివరించారు. రెడ్ బుక్ పేరుతో వైసీపీ శ్రేణులను వేధించిన వారికి భవిష్యత్ లో సినిమా చూపిస్తాం’’ అంటూ ఇప్పటికే జగన్ హెచ్చరించారని వారు గుర్తు చేశారు.