అమరావతి-విధాత : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తీవ్రమైన ఇంజనీరింగ్ లోపాలు జరుగుతున్నాయని, భద్రతా ప్రమాణాల ఉల్లంఘన కొనసాగుతుందని సెంటర్ ఫర్ లిబర్టీ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం విజయవాడలోని హోటల్ ఐలాపురంలో సెంటర్ ఫర్ లిబర్టీ సభ్యులు యెదుకూరి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలను నలమోతు చ క్రవర్తి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ప్రజంటేషన్ లో కేంద్ర జలసంఘం( సీడబ్య్లుసీ), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ), అంతర్జాతీయ నిపుణులు ఖమిటీ(పీ ఓ ఇ) నివేదికల ఆదారం 5 కీలక వైఫల్యాలను ఆయన వెల్లడించారు.
1) ప్రాజెక్ట్ నిర్మాణంలో అత్యంత కీలకమైన డయా ఫ్రమ్ వాల్ నిర్మాణంలో తీవ్రమైన నాణ్యతాలోపాలు జరిగాయని ఆరోపించారు. నాసిరకం కాంటక్రీట్ వాడారని ఆరోపించారు. ప్రతి రోజూ కాంక్రీట్ బ్లీడింగ్ జరగడం వల్ల గోడ పటుత్వం దెబ్బతింటోందని, ఆ పగుళ్లను ప్లాస్టరింగ్ చేసి కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఈ ప్రజంటేషన్ లో చూపించారు.
2) నాణ్యతా లోపాలను సరిదిద్ద కుండా సుమారు 400 మీటర్ల పొడవునా గోడ ఎత్తును19 మీటర్ల నుంచి 18.5 మీటర్లకు కుదించారని తెలిపారు.
3) ఎలాంటి ముందస్తు అనుమతులు, సరైన కారణాలు లేకుండా గ్యాప్-1 ట్రెంచ్ లోతును 23 మీటర్ల నుంచి 24 మీటర్లకు కుదించారని, ఇది డ్యామ్ భద్రతకు పెనుముప్పు అని వివరించారు.
4) 2023లో కొట్టుకు పోయిన స్పిల్ వే గైడ్ బండ్ పునర్నిర్మాణాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మొత్తం స్పిల్ వే కే ప్రమాదం వాటిళ్లుతుందన్నారు.
5) స్పిల్ వే అప్రోచ్ చానల్ లో ఇంకా 38.55 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి ఉండగా, కేవలం 5 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే ఉందని లెక్కలు తారుమారు చేసి తవ్వకాలను అర్థాంతరంగా నిలిపి వేసే కుట్ర జరుగుతోందన్న సందేహాం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ లో ఇప్పటికే గైడ్ బండ్ కుంగిపోయిందని, రేపు ప్రాజెక్ట్ కు గుండె కాయ లాంటి డయా ఫ్రమ్ వాల్ కు కూడా అదే గతి పడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. ఈ ఇంజనీరింగ్ ఉల్లంఘనలను ఇలాగే వదిలేస్తే, ప్రాజెక్ట్ దిగువన ఉన్న లక్షలాధి మంది ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించి సేఫ్టీ ఆడిట్ కోరతామని ఆయన హెచ్చరించారు.
భవిష్యత్ లో ప్రమాదాన్ని నివారించడానికి ఆయన ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు.. ఆ డిమాండ్లు ఇదే..
– ప్రస్తుత కాంట్రాక్ట్ తో సంబంధం లేదని స్వంతంత్ర నిపుణుల కమిటీతో డయాఫ్రమ్ వాల్ పటుత్వాన్ని పరిరక్షించాలి.
– కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రభావం లేని స్వతంత్ర పీఎంసీ, క్వాలిటీ కంట్రోల్(క్యూసీ) ఏజెన్సీని తక్షణమే నిమించాలి.
– భద్రతను పణంగా పెట్టి పనులు వేగం చేయకూడదు. నాణ్యత నిర్ధారణ జరిగే వరకు ఇసీఆర్ఎ ఫ్ డ్యామ్ పనులను నెమ్మదింపజేయాలి.
– గైడ్ బండ్ మరమ్మతులకు తక్షణమే వనరులను మళ్లించా పనులు పూర్తి చేయాలి.
– కాంక్రీట్ పనులకు సంబందించిన రోజు వారి నివేదికలు, సోనిక్ లాగింగ్(సీ ఎస్ ఎల్) టెస్ట్ ఫలితాలను ప్రజల పరిశీలనార్థం పబ్లిక్ డొమైన్ లో ఉంచాలి.
-2023 నాటి గైడ్ బండ్ వైఫల్యానికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి.
