Chandrababu Naidu| అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా ఏపీ విజన్ డాక్యుమెంట్: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు విజన్ డాక్యుమెంటు రూపొందించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కార్యక్రమంలో చంద్రబాబు హాజరై మాట్లాడారు. 2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాభివృద్ధికి విజన్ రూపకల్పన చేశాం అని తెలిపారు.

Chandrababu Naidu| అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా ఏపీ విజన్ డాక్యుమెంట్: సీఎం చంద్రబాబు

విధాత, హైదరాబాదా్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు విజన్ డాక్యుమెంటు రూపొందించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కార్యక్రమంలో చంద్రబాబు హాజరై మాట్లాడారు. 2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాభివృద్ధికి విజన్ రూపకల్పన చేశాం అని, 15 శాతం వృద్ధి రేటు నిలకడగా కొనసాగేలా చర్యలు తీసుకున్నాం అని తెలిపారు. వ్యవసాయం, సేవల రంగం, పారిశ్రామిక రంగం అభివృద్ధికి వీలుగా ప్రణాళికలు రూపొందించుకున్నాం అన్నారు. ఉద్యాన, ఆక్వా రంగాల్లో కూడా ఎగుమతుల ద్వారా వృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాం అని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యువ పారిశ్రామిక వేత్తల అవసరం చాలా ఉంది. దీనిని అందిపుచ్చుకోవాలని కోరుతున్నానని తెలిపారు. ఏపీని దేశంలోనే అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా విజన్ డాక్యుమెంట్ రూపోందించాం

నేటి పరిపాలన నిర్ణయాలే రేపటి చరిత్ర

పాలనలో ఇవాళ తీసుకున్న నిర్ణయాలన్నీ రేపటికి చరిత్ర అవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా తదితర అంశాల్లో తీసుకువచ్చిన సంస్కరణలతో హైదరాబాద్ కు ఎకోసిస్టం వచ్చింది అని, ప్రపంచంలోని మోస్ట్ లైవబుల్ సిటిగా హైదారాబాద్ అభివృద్ధి అయ్యిందని గుర్తు చేశారు. ఇదేమీ ఒక్కరోజులో జరిగింది కాదు అని, తెల్లవారు జామునే తనిఖీల నుంచి వివిధ నిర్ణయాలు ఈ మార్పునకు కారణం అయ్యాయని స్పష్టం చేశారు. అప్పుడు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే పంపుసెట్ గురించి మాట్లాడాలని విమర్శించారు అని, అయితే గతంలో తీసుకున్న స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలితాలు ఇచ్చాయి అని పేర్కొన్నారు. విభజన తర్వాత ఏపీలో ఒకే చోట పెద్ద మొత్తంలో భూమి లేదు అందుకే రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ అనే ఐడియాను తీసుకువచ్చాం అని, అమరావతి నిర్మాణం జరుగుతుండగా గత పాలకులు దానిని శ్మశానం అని గెలి చేసి విధ్వంసం చేశారు అని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ దానిని పునర్నిర్మిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ ప్లస్ గా అమరావతి తయారవుతుంది అన్నారు.

ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి

టెక్నాలజీని అనుసంధానించి స్మార్ట్ సిటీగా, బ్లూ గ్రీన్ రాజధానిగా అమరావవతి రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం చేపడుతున్నాం అని చంద్రబాబు తెలిపారు. ఏపీలో మూడు రీజియన్లుగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నాం అని, అమరావతిలో త్వరలోనే క్యాంటం కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. త్వరలోనే క్వాంటం కంప్యూటర్ తయారీకి అవసరమైన పరికరాల తయారీ కూడా చేసేలా చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు గూగుల్ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోందని, రిలయన్స్ కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో వివిధ అంశాలపై ఇబ్బందులు వస్తున్నాయని, గ్యాస్ కొరత లాంటివి ఎదుర్కోంటున్నాం అని, యుద్ధం తర్వాత మనల్ని మనం చాలా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది అన్నారు.

పోలవరం పూర్తితో మరింత అభివృద్ది

అమరావతి తర్వాత మరో పెద్ద ప్రాజెక్టు పోలవరం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గోదావరిలో వచ్చే 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్నారు. 2019 వరకూ 72 శాతం పనులు కూడా పూర్తి చేశాం. కానీ గత పాలకులు దానిని పట్టించుకోక ధ్వంసం చేశారు, రూ.440 కోట్లతో నిర్మించిన డయాఫ్రాం వాల్ వాళ్ల హయాంలో ధ్వంసమైపోయింది అని ఆరోపించారు. మళ్లీ అదే పనిని రూ.1000 కోట్లతో చేపట్టాల్సి వస్తోంది అన్నారు. త్వరలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఇతర రాష్ట్రాలకూ ప్రయోజనం కలిగేలా చేయవచ్చు అన్నారు.