పొలం చదును పనులు నిర్వహిస్తున్న ఓ ట్రాక్టర్ కు నాగుపాము ఎదురెళ్లిన ఘటన వైరల్ గా మారింది. ఓ గ్రామంలో ట్రాక్టర్ తో పొలం దున్నతూ చదును చేసే పనులు సాగుతుండగా..ఆకస్మాత్తుగా ఓ నాగుపాము సర్రున దూసుకొచ్చి ఆ ట్రాక్టర్ కు ఎదురెళ్లింది. పడగవిప్పి నిలుచుని ట్రాక్టర్ ను ముందుకు కదలనిచ్చేది లేదంటూ అడ్డుపడింది. ఈ సంఘటనను చూసిన ట్రాక్టర్ డ్రైవర్, రైతులు ఆశ్చర్యపోయారు.
పామును బెదిరించేందుకు డ్రైవర్ ట్రాక్టర్ ను దాదాపుగా పాము మీదకు తీసుకెళ్లేలా ముందుకు వెనక్కి రెండు మూడుసార్లు నడిపించినా ఆ నాగుపాము బెదరలేదు. ట్రాక్టర్ చక్రం దానికి అత్యంత సమీపానికి వచ్చినప్పటికీ అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. పడగవిప్పి తగ్గేదేలేదన్నట్లుగా బుసలు కొట్టింది. పాము ప్రవర్తనతో ఆశ్చర్యపోయిన డ్రైవర్ ట్రాక్టర్‌ను అక్కడే ఆపేశాడు. ఆ పాము ఏమాత్రం కదలలేదు. అప్పుడు వారిద్దరి మధ్య ఒక వింత నిశ్శబ్దం ఆవరించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మాటలు రాని ఒక జీవి అంత భారీ ట్రాక్టర్ ముందు నిలబడే సాహసం చేసిందంటే, కచ్చితంగా దానికి ఏదో బలమైన కారణం లేదా అత్యవసర పరిస్థితి ఉండి ఉంటుందని కొందరు…ఆ పాము తన గుడ్లను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తోందో, లేక ఏదైనా రహస్యం గురించి సందేశాన్ని తెలియజేయాలనుకుందోనంటూ ? మరికొందరు, ఏదైనా పురాతన నిధికి కాపలాగా ఉందోనని ఇంకొందరు తోచిన కామెంట్లు పెట్టారు.
అయితే నాగుపాములు సాధారణంగా వాటి ఆవాస ప్రాంతానికి ఆటంకం కలిగినప్పుడు ప్రతిచర్యలో భాగంగా పడగను పైకి ఎత్తి కదలకుండా ఉండిపోవడం వంటి బెదిరింపు ప్రవర్తనను ప్రదర్శిస్తాయని వన్యప్రాణుల నిపుణులు చెబతున్నారు. ఆ సమయంలో పాము చర్య అతీంద్రియ శక్తిగా కాకుండా…దాని సాధారణ రక్షణ చర్యలుగా మాత్రమే చూడాలని స్పష్టం చేస్తున్నారు.
आज शाम दोस्त खेत जोतने गया तभी यह घटना देखकर उसके होश उड़ गए।
ट्रैक्टर का भारी पहिया आगे बढ़ ही रहा था कि एक विशाल कोबरा ठीक सामने आकर रुक गया पहिया बिल्कुल करीब आ चुका था फिर भी सांप एक इंच भी पीछे नहीं हटा।
फन फैलाया और सीना तान कर ट्रैक्टर को आगे बढ़ने से रोक रहा था दोस्त… pic.twitter.com/cOfs6oBsV0
— Ankit Yadav (@Ankit_Talkss) August 13, 2026