ఒక్క కోబ్రాను చూస్తేనే గుండె ఆగినంత పనై భయంతో జనం దూరంగా పరుగు లంఘించుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి ఒకేసారి పదుల సంఖ్యలో కోబ్రాలను పట్టుకుని అడవిలో ఒకేసారి వాటిని విడిచిపెడుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. స్నేక్ క్యాచర్ గా పనిచేసే ఆ వ్యక్తి తను పట్టుకున్న కోబ్రా(నాగుపాములు)లను జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడుతుండటం ఆ వీడియోలో కనిపిస్తుంది.
ఆ స్నేక్ క్యాచర్ తను పట్టుకున్న కోబ్రాలను ఫ్లాస్టిక్ డబ్బాలలో బంధించి..వాటిని ఓ అటవీ ప్రాంతంలో వదిలేందుకు వెళ్లాడు. అక్కడ ఒకేసారి వరుసగా డబ్బా మూతలన్నింటిని తెరిచి కోబ్రాలను బయటకు వదిలాడు. డబ్బాల నుంచి బయటకు వచ్చిన కోబ్రాలు పడగలు విప్పి బుసలు కొడుతూ ఎటు పోవాలన్నదానిపై ఆలోచిస్తున్నట్లుగా కనిపించాయి. కడబ్బాల నుంచి బయపడిన వెంటనే అవి అడవిలో తలో దిక్కుకు పరుగులు పెట్టాయి. అత్యంత విషపూరితమైన కోబ్రాలను వదిలిపెట్టే క్రమంలో ఆ వ్యక్తి ఎలాంటి భయం, రక్షణ పరికరాలు లేకుండా ప్రవర్తించడం ఈ వీడియో చూసిన నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. పాములు పట్టడంలో, వాటిని సురక్షిత ప్రాంతాలలో వదిలివేయడంలో ఆ వ్యక్తి నైపుణ్యం, సాహాసం ప్రశంసనీయమని అభినందిస్తున్నారు.
एक शख्स दर्जनों सांपों को सुरक्षित जंगल में छोड़ने आया।
कहते हैं प्रकृति से प्यार करो लेकिन भाई प्यार की भी एक लिमिट होती है। pic.twitter.com/eIlkM5FPoR
— Mahmud (@Mahamud313) August 3, 2026