నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంయాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(YTPS) ఎదుట భూ నిర్వాసితుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. వైటీపీఎస్ ఎన్‌క్రోచ్‌మెంట్ భూ బాధితులు తమ భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.
భూములు కోల్పోయిన కుటుంబానికి ఒకరి చొప్పున ఉద్యోగం ఇవ్వాలని, బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి మా సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు.
మరిన్ని చదవండి :