ఝార్ఖండ్‌లో పేపర్ లీక్‌ నిరసనలు.. విద్యార్థి నాయకుడి నిరాహార దీక్ష

నీట్ పేపర్ లీకేజీపై చెలరేగిన నిరసనలు మరువకముందే ఝార్ఖండ్‌లో పేపర్ లీక్‌ ఘటనపై నిరసనలు రాజుకున్నాయి. జేపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు చోటుచేసుకున్నాయని అభ్యర్థుల ఆరోపిస్తున్నారు. రాంచీలో విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో జైపాల్‌సింగ్‌ ముండా స్టేడియంలో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఈ నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిరసనలకు మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Aug 03, 2026, 12:57 pm IST
Read Time: 2 mins
ఝార్ఖండ్‌లో పేపర్ లీక్‌ నిరసనలు.. విద్యార్థి నాయకుడి నిరాహార దీక్ష

నీట్ పేపర్ లీకేజీపై చెలరేగిన నిరసనలు మరువకముందే ఝార్ఖండ్‌లో పేపర్ లీక్‌ ఘటనపై నిరసనలు రాజుకున్నాయి. జేపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు చోటుచేసుకున్నాయని అభ్యర్థుల ఆరోపిస్తున్నారు. 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని, పేపర్ లీక్‌లపై విచారణ జరపాలని, రాష్ట్ర నియామక వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

పరీక్షల నిర్వహణలో అవకతవకలకు నిరసనగా రాంచీలో విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో జైపాల్‌సింగ్‌ ముండా స్టేడియంలో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఈ నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిరసనలకు మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.