కారు ఇంజిన్‌లో భారీ నాగుపాము.. వీడియో వైరల్
విధాత: పాములు అంటేనే శరీరంలో వణుకు పుడుతోంది. మరి నాగుపాము పేరు వింటే గుండె ఆగిపోయినంత పనినవుతుంది. అలాంటి ఓ భారీ నాగుపాము కారు ఇంజిన్‌లోకి చొరబడి.. తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. థాయిలాండ్‌లోని సాంగ్‌ఖ్లా ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి తన కారును ఇంటి ముందు నిలిపి ఉంచాడు. రాత్రి సమయంలో ఆ కారు ఇంజిన్‌లోకి 9 అడుగుల భారీ నాగుపాము చొరబడింది. పొద్దున్నే కారును నడిపే ముందు.. యజమాని ఇంజిన్ భాగాన్ని పరిశీలించాడు. ఇంజిన్‌లో చుట్టలు […]

విధాత: పాములు అంటేనే శరీరంలో వణుకు పుడుతోంది. మరి నాగుపాము పేరు వింటే గుండె ఆగిపోయినంత పనినవుతుంది. అలాంటి ఓ భారీ నాగుపాము కారు ఇంజిన్‌లోకి చొరబడి.. తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది.
థాయిలాండ్‌లోని సాంగ్‌ఖ్లా ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి తన కారును ఇంటి ముందు నిలిపి ఉంచాడు. రాత్రి సమయంలో ఆ కారు ఇంజిన్‌లోకి 9 అడుగుల భారీ నాగుపాము చొరబడింది. పొద్దున్నే కారును నడిపే ముందు.. యజమాని ఇంజిన్ భాగాన్ని పరిశీలించాడు. ఇంజిన్‌లో చుట్టలు చుట్టుకుని ఉన్న నాగుపామును చూసి షాక్ అయ్యాడు.
క్షణాల్లోనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించాడు. స్నేక్ క్యాచర్స్ వచ్చే వరకు పాము ఎవరికి ఎలాంటి హానీ కలిగించలేదు. ఇక పాములు పట్టే వ్యక్తి ఆ పామును పట్టుకుని తన సంచిలో వేసుకున్నాడు. అనంతరం ఆ పామును అడవుల్లో వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొద్ది రోజుల క్రితం ఓ భారీ నాగుపాము యాక్టివాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. పాములు పట్టే వ్యక్తి స్క్రూ డ్రైవర్ సాయంతో ఆ పామును బయటకు తీశాడు. ఆ పాము బుసలు కొడుతూ, పడగ విప్పి స్థానికులందరినీ తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.