Site icon vidhaatha

YS JAGAN | దువ్వాడ శ్రీనుకు నో టికెట్.. జగన్ మాట తప్పుతారా

YS JAGAN |

మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడిగా ట్యాగ్ లైన్ ఉన్న జగన్ మోహన్ రెడ్డి మాట తప్పినట్లేనా.. టికెట్ విషయమై ఇచ్చిన మాట తప్పి వేరొకరికి ఇస్తున్నట్లేనా.. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో సీటును వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆశిస్తుండదమే కాదు ఆయనకే టికెట్ అని గతంలో జగన్ కూడా హామీ ఇచ్చి ప్రకటన కూడా చేశారు.

అయితే ఇప్పుడు ఆయనకు పోటీగా .. ఆయన భార్య వాణి ఇప్పుడు టికెట్ కోసం గట్టిగా పోరాడుతున్నారు. టెక్కలి జడ్పీటీీసి గా ఉన్న వాణి తాను పోటీ చేస్తాం అని గట్టిగా పట్టుబడుతున్నారు. . దీంతో.. జగన్మోహన్ రెడ్డి వద్దకు ఈ వ్యవహారం వెళ్లింది. టెక్కలి టిడిపి తరఫున అచ్చెన్నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈసారి అచ్చెన్నను ఎలాగైనా ఓడించాలని జగన్ పట్టుదలగా ఉన్నారు.

ఈ తరుణంలో అక్కడ వాణి అయితేనే బెటరేవని జగన్ భావించారట. అందుకే ప్రస్తుతానికి వాణిని మించిన అభ్యర్థి లేరని జగన్ భావించి, టికెట్ ఖరారు చేశారని అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మొన్న ఎంపిగా శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. దీంతో ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

Exit mobile version