సోషల్ మీడియా ఒక్కటి చాలు.. ప్రపంచంలో జరిగే వింతలన్నీ ఉన్నచోటునుంచే చూసేయొచ్చు. ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో నెట్టింట దర్శనమిచ్చేస్తోంది. అలా ఎన్నో వింతలు, మరెన్నో ఘటనలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. తాజాగా ఇప్పుడు ఓ షాకింగ్ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేసేస్తోంది.
బైక్‌లు, ఫర్నిచర్ ధ్వంసం..
ఓ అడవి దున్న (Wild Buffalo) ఏకంగా బైక్ షోరూమ్ (Bike Showroom)లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కేరళ (Kerala) రాష్ట్రంలోని కన్నూర్ (Kannur) జిల్లాలో చోటు చేసుకుంది. కూతుపరంబ పట్టణంలోని ద్విచక్రవాహన షోరూమ్‌లోకి నిన్న ఉదయం అడవి దున్న దూసుకెళ్లింది. ఆ సమయంలో షోరూమ్ మూసేసి ఉంది. సమీపంలో నుంచి వచ్చిన దున్న ఒక్కసారిగా హీరో మోటోకార్ప్ బైక్ షోరూమ్ అద్దాలను ధ్వంసం చేసుకుంటూ లోపలికి ప్రవేశించింది. అనంతరం అక్కడ డిస్‌ప్లేలో పెట్టిన బైక్‌లను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన దృష్యాలు షోరూమ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
షోరూమ్‌కు నష్టం..
అయితే, ఆ సమయంలో షోరూమ్ ఇంకా తెరవకపోవడంతో సిబ్బంది, కస్టమర్లు ఎవరూ లేదు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. షోరూమ్‌కు భారీగా నష్టం వాటిలినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అప్రమత్తమైన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకునేలోపే దున్న సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Video Link :
Wild Gaur Rampages Through Showroom in Kannur
Kannur,Kerala
Panic gripped Purakkalath, Kuthuparamba in #kerala on Sunday morning when a #WildGaur (#IndianBison) stormed into the DM Hero two-wheeler showroom. Around 8:30 am, the animal charged through the glass doors, damaging… pic.twitter.com/Ykp8FGrLmS
— Yasir Mushtaq (@path2shah) February 2, 2026
ఇవి కూడా చదవండి :
Kozhikode Viral Video : రెప్పపాటులో మృత్యువును తప్పించుకున్న చిన్నారి.. వీడియో వైరల్
Koti ATM Robbery Case : కోఠి కాల్పుల కేసులో పురోగతి.. నిందితుల గుర్తింపు!
