• Telugu News
  • /National

Kozhikode Viral Video : రెప్పపాటులో మృత్యువును తప్పించుకున్న చిన్నారి.. వీడియో వైరల్

భూమి మీద నూకలుంటే చావు కూడా వెనక్కి తగ్గుతుంది! కేరళలో వేగంగా వస్తున్న బస్సు కింద పడబోయి ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 02, 2026, 6:36 pm IST
Read Time: 3 mins
Kozhikode Viral Video : రెప్పపాటులో మృత్యువును తప్పించుకున్న చిన్నారి.. వీడియో వైరల్

విధాత : భూమి మీద నూకలుంటే ఎంతటి ప్రమాదమైన తప్పిపోతుందనడానికి ఓ మూడెళ్ల చిన్నారికి ఎదురైన బస్సు ప్రమాద ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కేరళలోని కోజికోడ్ లో రోడ్డుపై ఆగిన ఆటో నుంచి దిగిన చిన్నారి ఒక్కసారిగా రోడ్డు ఆవలివైపుకు పరుగెత్తింది. ఆటో వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆ చిన్నారి మీదుగా దూసుకెళ్లే పరిస్థితి ఎదురైంది. అయితే బస్సు డ్రైవర్ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో ఆ చిన్నారి నిండుప్రాణం నిలిచింది. చిన్నారిని గమనించిన డ్రైవర్ బస్సు సడెన్ బ్రేక్ వేయడం..అదే సమయంలో చిన్నారి సైతం ఓ అడుగు వెనక్కి వేయడంతో ఘోర ప్రమాదం తప్పింది.

ఈ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురికాక మానదు. ఈ ప్రమాదంలో రెప్పపాటులో చిన్నారి ప్రాణాలతో బయటపడటం నిజంగా అద్బుతం అని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ సంఘటన ప్రయాణాల్లో రోడ్ల మీ పిల్లల అప్రమత్తత విషయంలో తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేస్తుంది. పిల్లలు రోడ్డుపై నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా రోడ్డుపైకి పరిగెత్తకుండా, వాహనం ఢీకొనకుండా ఉండటానికి వారి చేతులు పట్టుకోవడం చాలా ముఖ్యం అని నెటిజన్లు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Nalgonda : లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
Revanth Reddy : కాంగ్రెస్ అభ్యర్థులకు రేపు బీ ఫామ్ ల పంపిణీ