Nalgonda : లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

నల్గొండ జిల్లాలో ఏసీబీ పంజా! భూమి ఆన్‌లైన్ నమోదు కోసం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన గుర్రంపోడు ఆర్ఐ హకీమ్. ఎనిమిదేళ్ల వేధింపులకు ఏసీబీ చెక్!

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Feb 02, 2026, 6:13 pm IST
Read Time: 2 mins
Nalgonda : లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

విధాత : నల్గొండ జిల్లా గుర్రంపోడులో రైతు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటున్న ఆర్ఐ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. భూ సమస్యల పరిష్కారానికి ఒక రైతు నుంచి ఆర్ఐ హకీమ్ రూ. 20వేలు డిమాండ్ చేశాడు. బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించగా.. అవినీతి అధికారిని పట్టుకోవడానికి వల వేశారు.

రైతు నుంచి లంచం సొమ్ము తీసుకుంటుండగా.. హకీమ్ ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుర్రంపోడు తహశీల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. పత్రాలు, ఫైళ్లు తనిఖీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Revanth Reddy : కాంగ్రెస్ అభ్యర్థులకు రేపు బీ ఫామ్ ల పంపిణీ
Simultaneous Polls | 2029లో దేశమంతా జమిలి ఎన్నిక.. suప్రభుత్వ గడువు పొడిగింపు?