Simultaneous Polls | జమిలిపై బీజేపీ యాక్షన్‌ మోడ్‌.. 2029 ఫిక్స్‌?

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆశిస్తున్న జమిలి ఎన్నికలు 2029లో సాధ్యమయ్యేనా? అదే జరిగితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మరో ఆరు నెలలు వాయిదా వేస్తారా?

Reported by: Jagan Mohan Talluri | విధాత ప్రత్యేకం | Feb 03, 2026, 7:26 pm IST
Read Time: 10 mins
Simultaneous Polls | జమిలిపై బీజేపీ యాక్షన్‌ మోడ్‌.. 2029 ఫిక్స్‌?

విధాత, హైదరాబాద్:
Simultaneous Polls | ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ విషయంలో చాలా ఆతృతతో ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2029 ఎన్నికలను జమిలి పద్ధతిలోనే నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నదని సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణలో 2028లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. వాటిని ఏడాదిపాటు వాయిదా వేసి, జమిలి పద్ధతిలో నిర్వహిస్తారని తెలుస్తున్నది. జమిలి ఎన్నికలపై ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకురానున్నదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంతకు ముందే జమిలి బిల్లుపై పార్లమెంటు సంయుక్త కమిటీ నివేదికను కూడా ప్రవేశపెడతారని తెలుస్తోంది. బిల్లు పాసై, చట్టబద్ధత వస్తే.. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే.. పొరుగునే ఉన్న ఏపీతోపాటే పోలింగ్‌ నిర్వహిస్తారా? వేర్వేరు తేదీల్లోనా? అనేది మాత్రం షెడ్యూల్‌ విడుదలయ్యే సమయంలోనే స్పష్టం కానుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

Medaram Monalisa | మేడారం మోనాలిసా.. ఈ IPS బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిపోయిది!

తెలంగాణలో 2023 నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. డిసెంబర్‌ 3న ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడించారు. ఈ ఎన్నికలలో మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక స్థానంలో గెలుపొందాయి. గత అసెంబ్లీ ఎన్నికలు 2018 డిసెంబర్ 7వ తేదీన జరిగాయి. అసెంబ్లీ పదవీ కాలం 2024 జనవరి 16వ తేదీతో ముగియనుండటంతో 2023 నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధించడంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సాధారణంగా అసెంబ్లీ పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించి, ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ ప్రకారంగా 2028 అక్టోబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించాల్సి ఉంటుంది. నవంబర్ నెలలో ఎన్నికల ప్రకియ ను పూర్తి చేసి డిసెంబర్ నెలలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
India’s First Offshore Airport | అరేబియా సముద్రంపై దేశ తొలి విమానాశ్రయం.. ముంబైలో టెక్నాలజీ అద్భుతం

ఎన్నికలకు అటు ఇటుగా మరో మూడు సంవత్సరాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలనే పట్టుదలతో ఉన్నట్లు బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్లమెంట్ సంయుక్త కమిటీ కూడా సానుకూలంగా నివేదిక ఇవ్వడంతో బిల్లుకు చట్ట రూపం కల్పించనున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఎగువ, దిగువ సభల్లో ఆమోదముద్ర లభిస్తే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రమే మారిపోతుందంటున్నారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే తెలంగాణలో కూడా అప్పుడే ఎన్నికలు జరిగే సూచనలు బలంగా కన్పిస్తున్నాయి. అదే జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ కాలం మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా ఈ పొడిగింపు చేయనున్నారు.

భారత దేశ పార్లమెంటు ఎన్నికలు 2024 ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ మధ్యలో మొత్తం ఏడు దశల్లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 543 సీట్లకుగాను బీజేపీకి సాధారణ మెజార్టీ రాలేదు. 240 దగ్గరే ఆగిపోయిన బీజేపీ.. ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది. 2024 జూన్ 9వ తేదీన మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. కేంద్రంలోని సంకీర్ణ బీజేపీ ప్రభుత్వ పదవీకాలం 2029 జూన్ తో ముగియనున్నది. ఆ తరువాత దేశ వ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి నిర్వహిస్తారా లేదా ముందస్తుగా నిర్వహిస్తారా అనేది ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుతో స్పష్టత రానుంది.

గతేడాది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడులో మాట్లాడుతూ, జమిలి ఎన్నికలు 2029లోనే జరుగుతాయని, ముందస్తు అనేది ఊహాగానాలేనని కొట్టిపారేశారు. జమిలి ఎన్నికలు ముందుగానే వస్తాయంటూ ప్రతిపక్షాలు లేనిపోని ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు అలాంటి వార్తల పట్ల అపోహలు వద్దని ఆమె కోరారు. పరోక్షంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు పాలన కొనసాగిస్తుందని, ఆ తరువాతే జమిలి వస్తుందని నిర్మల మాటల్లో సుస్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అయితే 2028 సంవత్సరంలోనే జమిలి పూర్తవుతుందని, అందుకు తగ్గట్టుగా బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటుందనే వాదనలు కూడా లేకపోలేదు. ఓడిపోయిన జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ఎవరికి వారుగా జమిలిపై లెక్కలు వేసుకుంటూ తమ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. అప్పటికల్లా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనతో పాటు కుల గణన కూడా పూర్తవుతుందని, కులాల వారీగా లెక్కలు తేలుతాయంటున్నారు. దీని ప్రకారం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణ పూర్తి చేసే 2028లోనే జమిలి పూర్తి చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు.

Read Also |

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. చార్జ్ షీట్ కు సిట్ సిద్దం ?
Dalai Lama : 90 ఏళ్ల వ‌య‌సులో రికార్డు.. ద‌లైలామాకు గ్రామీ అవార్డు
lion attack buffalo video| సింహాన్ని తరిమిన దున్నల మంద.. వైరల్ వీడియో

Jagan Mohan Talluri
jaganmohan.talluri@gmail.com