lion attack buffalo video| సింహాన్ని తరిమిన దున్నల మంద.. వైరల్ వీడియో

ఐకమత్యమే మహాబలం అని చాటడానికి చిన్న పిల్లలకు వేటగాడు.. వలతో ఎగిరిపోయిన పావురం కథను చెబుతుంటారు. అయితే అడవిలోని దున్నల మందకు ఆ నీతి కథ తెలియకపోయినా.. సమయ స్ఫూర్తితో అపాయాన్ని ఐక్యతగా ఎదుర్కోవడంలో మాత్రం విజయం సాధించి..ఐకమత్యమే మహాబలం అనే నీతి కథను చాటి చెప్పాయి.

Reported by: Y.V. Narsimha Reddy | వైరల్ న్యూస్ | Feb 01, 2026, 4:16 pm IST
Read Time: 3 mins
lion attack buffalo video| సింహాన్ని తరిమిన దున్నల మంద.. వైరల్ వీడియో

విధాత : ఐకమత్యమే మహాబలం అని చాటడానికి చిన్న పిల్లలకు వేటగాడు..  వలతో ఎగిరిపోయిన పావురం కథను చెబుతుంటారు. అయితే అడవిలోని దున్నల మందకు ఆ నీతి కథ తెలియకపోయినా.. సమయ స్ఫూర్తితో అపాయాన్ని ఐక్యతగా ఎదుర్కోవడంలో మాత్రం విజయం సాధించి..ఐకమత్యమే మహాబలం అనే నీతి కథను చాటి చెప్పాయి.

ఓ అడవిలో నీళ్లు తాగేందుకు నీటి కుంటలోకి దిగిన ఓ గేదెపై సింహం దాడి చేసింది. గేదెను నోట కరిచి దాన్ని చీల్చి తినేందుకు గట్టిగా ప్రయత్నించింది. ప్రాణాలు కాపాడుకునేందుకు పోరాడటంతో గేదె శక్తి చాలలేదు. ఇక తను సింహానికి ఆహారం కావాల్సిందేననుకుంటున్న దశలో గేదె ఆర్తనాదాలు విన్న సమీపంలోని దున్నల మంద పరుగున వచ్చి సింహంపై దాడికి దిగాయి. గేదెను రక్షించేందుకు సింహంపైకి దూసుకెళ్లాయి. అకస్మాత్తుగా మీదకు వచ్చిన అడవి దున్నల మందను చూసిన సింహం గేదెను వదిలేసి పరుగు లంఘించుకుంది.

ఈ సంఘటనకు సంభంధించిన వీడియో.. అడవిలోని వన్యప్రాణులు ఎదుర్కోనే అపాయాలు, దాడులు, రక్షణాత్మక చర్యలకు.. ప్రాణాపాయ పరిస్థితులను ఐక్య పోరాటాలతో అధిగమించేందుకు నిదర్శనంగా నిలిచింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఐకమత్యమే మహాబలం అన్న నీతి కథకు చక్కని నిదర్శనమని గుర్తుచేసిందని కామెంట్లు పెడుతున్నారు.