Revanth Reddy : కాంగ్రెస్ అభ్యర్థులకు రేపు బీ ఫామ్ ల పంపిణీ

మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు ఏర్పాటుగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థులకు రేపు బీ ఫారమ్‌ల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

Revanth Reddy : కాంగ్రెస్ అభ్యర్థులకు రేపు బీ ఫామ్ ల పంపిణీ

విధాత, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల సమరంలో రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. రేపు మంగళవారం నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్ ల పంపిణీలో పార్టీలు నిమగ్నమయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రేపు బీ ఫామ్ ల పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సోమవారం పీఏసీ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై మార్గదర్శకం చేశారు. రాష్ట్రంలోని 116 మున్సిపాల్టీలు 7 కార్పోరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో 85శాతం విజయం సాధంచాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు నిర్ధేశించారు. రెబల్స్ బరిలో ఉండకుండా చూసుకోవాలని, వారిని బుజ్జగించి పోటీ నుంచి ఉపసంహరించుకునేలా చూడాలని, అంతా ఐక్యంగా గెలుపు కోసం కష్టపడాలని సూచించారు. పార్టీ కోసం పని చేసిన వాళ్లను గెలిపించుకోవాలి. టికెట్ లు రాని బలమైన నాయకులు ఉంటే కార్పొరేషన్ పదవుల్లో అవకాశం ఇద్దాం అని హామీ ఇవ్వండి అని సూచించారు. అప్పుడే మున్సిపల్ చైర్మన్‌,కార్పొరేషన్లకు మేయర్‌లను ప్రకటించవద్దు అని సూచించారు. సామాజిక సమీకరణాల ప్రకారం చైర్మన్‌లను ఎంపిక చేయాల్సి ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

రేపు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ లతో సమావేశం

రేపు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ లుగా ఉన్నటువంటి మంత్రులతో సీఎం పాత కార్యాలయం జూబ్లీహిల్స్ లో సమీక్ష సమావేశం ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్బంగా పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్ లు పంపిణీ చేస్తామని తెలిపారు. పార్టీ గుర్తుపై ఎన్నికలు జరుగుతున్నందునా అందరూ చాలెంజ్ గా తీసుకోవాలని స్పష్టం చేశారు. సర్వేలన్ని కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరు స్థానికంగా ఎన్నికల మ్యానిఫెస్టోతో ఓటర్ల ముందుకు వెళ్లాలని, గెలిస్తే ప్రభుత్వ సహకారంతో జరిగే అభివృద్దిని ప్రచారం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం అన్నారు.

4నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11న జరగనుండగా..13న కౌంటింగ్ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 4నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలకు హాజరవుతారు. 4వ తేదీన మిర్యాలగూడ మున్సిపాల్టీలో, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6న నిజామాబాద్ జిల్లాలోని రూరల్‌లో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న భూపాలపల్లిలో, 9న మెదక్‌లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి :

Simultaneous Polls | 2029లో దేశమంతా జమిలి ఎన్నిక.. suప్రభుత్వ గడువు పొడిగింపు?
Allu Arjun | రామ్ చ‌ర‌ణ్ దంప‌తులకి బన్నీ స్పెష‌ల్ విషెస్.. పోస్ట్‌లో చిరంజీవి గురించి ప్ర‌త్యేకమైన కామెంట్