విధాత : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ‘ఫ్రెష్ బస్’ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదం తర్వాత పరారైన బస్సు డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్నారు.