పులిగుట్ట వద్ద పూర్తి అయిన రెస్క్యూ ఆపరేషన్
విధాత, నిజామాబాద్: మూడు రోజులుగా బండరాళ్ల మధ్య నరకయాతన పడిన షాడ రాజు ఎట్టకేలకు సురక్షితంగా బయట పడ్డాడు. 43 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 1.55 గంటలకు రాళ్ల మధ్య నుండి బయటకు తీశారు.
అక్కడే వున్న రామారెడ్డి మండల మెడికల్ ఆఫీసర్ పరీక్షించిన తర్వాత ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజు తిరిగి రాలేదు. అప్పటి నుండి బండ రాళ్ల మధ్య నరకయాతన అనుభవించాడు. రాజు ప్రాణాలతో బయట పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.