Amazon Republic Day Sale | భారత గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్-2024కు సిద్ధమైంది. ఈ సందర్భంగా పలు వస్తువుల కొనుగోలుపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. రిపబ్లిక్ డే సేల్స్ షురూ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 12 గంటలకు ముందుగానే యాక్సెస్ లభించింది.
ఈ సందర్భంగా బ్యాంకు ఆఫర్‌లను ప్రకటించగా.. రిపబ్లిక్ డే సేల్స్ కోసం అమెజాన్ స్పెషల్ మైక్రో పేజీని రూపొందించింది. అమెజాన్‌లో ఈ సేల్ ఈ నెల 13 నుంచి ప్రారంభంకానున్నది. ప్రైమ్ మెంబర్స్‌కు 12 గంటల ముందుగానే అంటే జనవరి 12న అర్ధరాత్రి 12 గంటల నుంచే యాక్సెస్ లభించింది. అయితే, రిపబ్లిక్ డే సేల్స్ ముగియనుందో చెప్పలేదు. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తుల కొనుగోలుపై తగ్గింపు ఆఫర్స్‌ను తీసుకువచ్చింది. ఎస్‌బీఐ కార్డ్ ద్వారా ఏవైనా ఉత్పత్తులు కొనుగోలు చేస్తే 10శాతం తగ్గింపు లభించనున్నది. అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉన్న డీల్స్ గురించి వివరాలు వెల్లడించింది. సేల్స్‌లో వెల్‌కం రివార్డుగా క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నది. తొలిసారిగా అమెజాన్ నుంచి ఏవైనా ఉత్పత్తులు కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేసే యూజర్లు రూ.5వేల వరకు క్యాష్‌బ్యాక్ రివార్డు పొందే అవకాశం ఉంది. అలాగే పలు ఉత్పత్తుల కొనుగోలుపై కూపన్ తగ్గింపు దొరకనున్నది.
ఈ సేల్‌లో రాత్రి 8గంటలకు రూ.999 డీల్స్‌పై 99/డే నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్స్, బ్లాక్ బస్టర్ డీల్స్, గ్రాండ్ ఓపెనింగ్ డీల్స్, ప్రైస్ క్యాష్ స్టోర్ ఇలా పలు ఆఫర్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేల్స్‌లో అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,499 విక్రయించనున్నది. రూ.9,999 ప్రారంభ ధరతో 5జీ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉన్నది. అలాగే ఐఫోన్-13పై స్పెషల్ డీల్స్‌ను తీసుకువచ్చింది. అయితే, డీల్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పలేదు. వీటితో పాటు సామ్‌సాంగ్, వన్ ప్లస్, ఐక్యూ, హానర్, మోటో తదితర కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లపై భారీగానే ఆఫర్లు ఉండనున్నాయి.