ఇదేం అభిమానం రా సామి.. బాల‌య్య‌కి పాల‌తో కాదు మందుతో అభిషేకం..!

  • Publish Date - October 20, 2023 / 04:03 AM IST

నంద‌మూరి బాల‌కృష్ణ మంచి జోరు మీదున్నారు. ఆయ‌న న‌టించిన సినిమాలు, చేసే టీవీ షోలు మంచి హిట్స్ అవుతున్నాయి. దీంతో బాల‌య్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక తాజాగా ఆయ‌న భ‌గ‌వంత్ కేస‌రి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, శ్రీలీల ముఖ్య పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేసింది. అయితే బాలయ్య సినిమా అంటే అభిమానుల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెద్ద ఎత్తున బాల‌య్య క‌టౌట్స్ పెట్ట‌డం, ఆ క‌టౌట్‌కి పూల దండ‌లు వేయ‌డం, అలానే థియేట‌ర్ ద‌గ్గ‌ర డ‌ప్పులు, క్రాక‌ర్స్ పేల్చుతూ హ‌డావిడి చేయ‌డం ఇన్నాళ్లు మ‌నం చూస్తూనే ఉన్నాం.

అయితే భ‌గ‌వంత్ కేస‌రి సినిమా రిలీజ్ రోజున అభిమానులు చేసిన ప‌ని ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బాలయ్య అభిమానులు బాలకృష్ణ బ్యానర్స్ కి పాలతో కాకుండా ఆల్కహాల్ తో అభిషేకం చేయ‌డంతో అంద‌రు నోరెళ్ల‌పెట్టారు. బాల‌య్య‌కి మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ చాలా ఇష్ట‌మ‌ని ప‌లుమార్లు చెప్పారు. అందుకే వారు ఆయ‌న‌కి న‌చ్చిన మందుతోనే బాల‌య్య పోస్ట‌ర్స్‌కి అభిషేకం చేశారు. చాలా చోట్ల ఇలా అభిమానులు బాల‌య్య‌కి ఇష్ట‌మైన బ్రాండ్ మ్యాన్ష‌న్ హౌజ్‌తో అభిషేకం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

ఇక భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి ఆ అంచనాలకు తగ్గట్టే మంచి టాక్ తో దూసుకు పోతోంది. ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ట అభిమానులు సినిమాలోని ఎమోషనల్ సీన్స్, బాలకృష్ణ మాస్ అప్పీరెన్స్, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చూసి తెగ మురిసిపోతున్నారు.ఇక ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో.. దర్శకుడు అనిల్ రావిపూడి, శ్రీలీలతో పాటుతో పాటు పలువురు బాలకృష్ణను కలిసి ప్ర‌త్యేక‌ అభినందనలు తెలిపారు. యాక్షన్ పరంగా సినిమా మాస్ ఆడియన్స్ ని కూడా ఎంత‌గానో అల‌రిస్తుంద‌ని, ఈ సినిమా వంద రోజుల పాటు తప్పక ప్రదర్శింపబడుతుందంటూ బాలకృష్ణ అభిమానులు జోస్యం చెబుతున్నారు. మొత్తానికి బాల‌య్య ఖాతాలో మ‌రో మంచి హిట్ చేర‌డం ఫ్యాన్స్‌కి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

Latest News