Site icon vidhaatha

బిగ్ బాస్ ఓటీటీకి రంగం సిద్ధం.. ఎప్ప‌టి నుండి మొద‌లు, కంటెస్టెంట్స్ ఎవ‌రంటే..!

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం పంచే బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం తెలుగులో మంచి ఆద‌ర‌ణతో దూసుకుపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు సీజన్స్‌తో పాటు ఒక ఓటీటీ షో కూడా పూర్తి చేసుకుకుంది. రీసెంట్‌గా సీజ‌న్ 7 పూర్తి కాగా, దీనికి మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. ఉల్టా పుల్టా అంటూ షోపై చాలా ఆస‌క్తి పెంచిన నిర్వాహ‌కులు ఇటీవ‌ల షోకి ఎండ్ కార్డ్ వేశారు. డిసెంబర్ 17న బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. ఈ సారి కామ‌న్ మ్యాన్ విజేత‌గా నిలిచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఎంతో మంది సెల‌బ్రిటీలు ఉన్నా కూడా వారంద‌రిని ఓడించి ఫైన‌ల్‌లో క‌ప్ అందుకున్నాడు ప‌ల్ల‌వి ప్ర‌శాంత్. అయితే ఆయ‌న‌కి క‌ప్ అందుకున్న ఆనందం ఎంతో కాలం నిల‌వ‌లేదు.

అన్న‌పూర్ణ స్టూడియో బ‌య‌ట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన బీబ‌త్సానికి ఆయ‌నపై కేసు కూడా న‌మోదైంది. రీసెంట్‌గా చంచ‌ల్ గూడ జైలుకి వెళ్లిన ఆయ‌న బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు.ఇక ఇదిలా ఉంటే ప్ర‌తిసారి బిగ్ బాస్ షోపై ఏవో ఒక ఆరోప‌ణలు రావ‌డం, షోని బ్యాన్ చేయాల‌ని డిమాండ్స్ వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. సీజ‌న్ 7 త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌కి చాలా మంది ఆ షోని క్లోజ్ చేయాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే నిర్వాహ‌కులు మాత్రం త్వ‌ర‌లో ఓటీటీ షో మొదలు పెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు వినికిడి. గ‌తంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో గతంలో ఒక సీజన్ ప్రసారం అయ్యింది. బిందు మాధవి టైటిల్ విన్నర్ కాగా, దీనికి కూడా నాగార్జున హోస్టింగ్ చేశారు.

అయితే ఇప్పుడు ఓటీటీకి సంబంధించి మ‌రో సీజ‌న్ జ‌ర‌గ‌బోతున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది.త్వ‌ర‌లోనే బిగ్ బాస్ నాన్‌స్టాప్ సీజ‌న్ 2 ప్రారంభం కానుంద‌ని, కంటెస్టెంట్ ఎంపిక ప్ర‌క్రియ కూడా ఇప్ప‌టికే మొద‌లైంద‌నే ప్ర‌చారం న‌డుస్తుంది.ఓటీటీ షోకి కూడా నాగార్జున‌నే హోస్ట్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. అయితే బిగ్ బాస్ వ‌ల‌న చాలా మందికి మంచి జ‌ర‌గ‌డం ఏమో కాని నెగెటివిటీ ఎక్కువ‌గా ఏర్ప‌డుతుంది. ఈ క్ర‌మంలో షోలో పాల్గొనే వారి సంఖ్య కూడా త‌గ్గుతూ వ‌స్తుంది.ఓటీటీ వ‌ర్షెన్‌లో టాప్ సెలెబ్స్ కాకుండా అగ్గి పెట్టి మచ్చ, ఉప్పల్ బాలు వంటి సోషల్ మీడియా సెలెబ్స్ తో లాగించేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. బర్రెల‌క్కని కూడా ఈ ఓటీటీ షోకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు వినికిడి.త్వ‌ర‌లో వీటిపై ఓ క్లారిటీ అయితే వ‌స్తుంది.

Exit mobile version