హైదరాబాద్ : మీరు 2023, 2024లో ఇంటర్ పూర్తి చేశారా..? అందులోనూ ఎంపీసీ, బైపీసీ లేదా ఫార్మా టెక్నాలజీ, ఎంఎల్టీ(బ్రిడ్జి కోర్సు) కోర్సులు చదివారా..? ఆ కోర్సులు అభ్యసించిన వారికి ప్రముఖ ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్ ప్రయివేటు లిమిటెడ్ ఫార్మా కంపెనీ ఉద్యోగంతో పాటు ఉచిత డిగ్రీని అందించేందుకు సిద్ధమైంది. ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ కోర్సులు పూర్తి చేసేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తోంది. ఈ డిగ్రీకి అయ్యే ఖర్చును కూడా కంపెనీనే భరించనుంది. అయితే అభ్యర్థులకు ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. తదితర వివరాల కోసం 7032119370, 7995549496 అనే నంబర్లలో సంప్రదించొచ్చు.
మరి ఉద్యోగం పొందేందుకు అర్హతలు ఏంటి..?
– ఇంటర్ ఎంపీసీ, బైపీసీ లేదా ఫార్మా టెక్నాలజీ కోర్సుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
– 2023లో ఇంటర్ పాసై ఉండాలి. లేదా 2024లో ఇంటర్ ఎగ్జామ్స్ రాసి ఉండాలి.
– అభ్యర్థుల వయసు 20 సంవత్సరాలకు మించకూడదు.
బెనిఫిట్స్ ఇవే..
– ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రూ. 11 వేల చొప్పున నెల జీతం ఇస్తారు.
– మొదటి రెండేండ్లు క్యాంటీన్‌లో సబ్సిడీ కల్పిస్తారు. ఇక అకామిడేషన్‌పై కూడా సబ్సిడీ ఇవ్వనున్నారు.
– ఉచిత రవాణా సదుపాయం.
-కంపెనీ నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది జీతాల్లో పెంపుదల
-ఈఎస్ఐ కింద ఉద్యోగితో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పిస్తారు.
ఇంటర్వ్యూలు ఎక్కడంటే..?
మార్చి 21 – టీఎంఆర్జేసీ కరీంనగర్ గర్ల్స్ -2, కరీంనగర్ బస్టాండ్ సమీపంలో
మార్చి 22 – టీఎంఆర్ వొకేషనల్ జూనియర్ కాలేజీ నిజామాబాద్ బాయ్స్-4, నిజామాబాద్(ధర్మారం).
మార్చి 23 – టీఎంఆర్ జూనియర్ కాలేజీ నిర్మల్ బాయ్స్-1, చించోలి ఆర్టీవో ఆఫీస్ సమీపంలో.