Vice President Elections : ఉప రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. 152 ఓట్ల మెజారిటీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపొందినట్లు భారత ఎన్నికలసంఘం అధికారులు ప్రకటించారు. రాధాకృష్ణన్‌కు 452 రాగా ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు నమోదు అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 98.2 శాతం ఓటింగ్ జరిగినట్లు వెల్లడించింది. మొత్తం 767 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిలో 15 ఓట్లు చెల్లలేదు. ఈ ఎన్నికకు ఒక బ్యాలెట్ ఓటు రాగా అధి రద్దయినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
అయితే.. భారత ఉప రాష్ట్రపతిఎన్నిక పోలింగ్ పార్లమెంట్ నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’ బ్లాక్ లో ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి 7:30 గంటలకు ఫలితాలు వెల్లడించారు.
ఎన్డీయేకి 436మంది సభ్యులు మద్దతు ప్రకటించగా.. ఇండియా కూటమికి 324 మంది సభ్యులు మద్దతు తెలిపారు. జేడీయూ ఎంపీ గిరిలాల్ యాదవ్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సుదర్శన్ రెడ్డికి ఓటు వేస్తానని తెలిపారు. ఆప్ పార్టీ ఎంపీ స్వాతిమాలివాల్ కూడా పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి ఊహించనదానికంటే ఎక్కవ మెజారిటీ రావడంతో శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.