న్యూఢిల్లీ : భారత ఉప రాష్ట్రపతిఎన్నిక (Vice President Election)పోలింగ్(Voting) పార్లమెంట్ (Parliament) నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’ బ్లాక్ లో ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తొలి ఓటు వేశారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియ్యనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan), ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి(Justice Sudarshan Reddy)లు పోటీ పడుతున్నారు. లోక్‌సభ, రాజ్యసభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉండగా.. 386ఓట్లు గెలుపు కోసం అవసరమైన మార్క్ గా నిర్ణయించారు.
ప్రస్తుతం ఎన్డీయేకి 436మంది సభ్యులు మద్దతు ప్రకటించగా.. ఇండియా కూటమికి 324 మంది సభ్యులు మద్దతు తెలిపారు. జేడీయూ ఎంపీ గిరిలాల్ యాదవ్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సుదర్శన్ రెడ్డికి ఓటు వేయనున్నారు. ఆప్ పార్టీ ఎంపీ స్వాతిమాలివాల్ కూడా పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థుల ఓట్ల బలాబలాలు కాస్తా ఆటు ఇటుగా మారే అవకాశముంది.