Keerthy Suresh | లేచిపోయి పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నా.. పెళ్లినాటి భావోద్వేగాలను పంచుకున్న కీర్తి సురేష్

Keerthy Suresh | ప్రముఖ నటి కీర్తి సురేష్ 2024లో గోవాలో తన చిరకాల ప్రియుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికిన ఈ జంట వివాహం అప్పట్లో అభిమానుల్లో పెద్ద‌ చర్చకు దారి తీసింది. తాజాగా ఈ జంట ఏషియన్ పెయింట్స్ సహకారంతో తమ ఇంటిని అభిమానులకు పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

Keerthy Suresh | ప్రముఖ నటి కీర్తి సురేష్ 2024లో గోవాలో తన చిరకాల ప్రియుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికిన ఈ జంట వివాహం అప్పట్లో అభిమానుల్లో పెద్ద‌ చర్చకు దారి తీసింది. తాజాగా ఈ జంట ఏషియన్ పెయింట్స్ సహకారంతో తమ ఇంటిని అభిమానులకు పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సరదాగా ‘హౌస్ ఆఫ్ ఫన్’ అని పేరు పెట్టుకున్న తమ ఇంటి గుండా వీక్షకులను తీసుకెళ్లిన కీర్తి, ఈ సందర్భంగా తన పెళ్లి రోజున చోటు చేసుకున్న భావోద్వేగ క్షణాలను కూడా గుర్తు చేసుకుంది. ఈ వీడియోలో మాట్లాడిన కీర్తి సురేష్, తమ పెళ్లి ఇంత ఘనంగా జరుగుతుందని తాము ఎప్పుడూ ఊహించలేదని చెప్పింది.

కుటుంబ సభ్యుల ఆశీస్సులతో పెద్దల సమక్షంలో వివాహం జరగడం తమకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని పేర్కొంది. నిజానికి మొదట్లో ఇద్దరం సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలనుకున్నామని, అప్పట్లో లేచిపోయి పెళ్లి చేసుకుందామనిపించిన సందర్భాలూ ఉన్నాయని ఆమె చిరునవ్వుతో వెల్లడించింది. కానీ చివరకు కుటుంబాల మద్దతుతో జరిగిన పెళ్లి, జీవితంలో మరిచిపోలేని క్షణంగా మారిందని తెలిపింది.పెళ్లి సమయంలో తాను ఎదుర్కొన్న భావోద్వేగాన్ని వివరిస్తూ కీర్తి మరింత ఎమోషనల్ అయింది. 15 ఏళ్లుగా ఎదురు చూసిన బంధం ముహూర్తం సమయంలో ఒక్కటవుతున్నప్పుడు, ఆ క్షణంలో తాను పూర్తిగా మైమరిచిపోయానని చెప్పింది.

తాళి కట్టే సమయానికి చుట్టూ ఉన్నవాళ్లు, శబ్దాలు ఏమీ వినిపించలేదని, ఆ క్షణం అంతా భావోద్వేగాలతో నిండిపోయిందని గుర్తు చేసుకుంది. అదే సమయంలో ఆంటోనీ కళ్లలో కన్నీళ్లు చూడటం తన జీవితంలో తొలిసారి అని చెప్పి, తమ ప్రేమ ప్రయాణం ఎంత అందమైనదో ఆ క్షణం గుర్తు చేసిందని తెలిపింది. కీర్తి సురేష్ సినిమాల్లోకి అడుగుపెట్టకముందే ఆంటోనీతో ప్రేమలో పడింది. దుబాయ్‌లో వ్యాపారవేత్తగా స్థిరపడిన ఆంటోనీ కుటుంబం కేరళలోని కొచ్చికి చెందినది. దాదాపు 15 ఏళ్ల పాటు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో కొనసాగిన ఈ ప్రేమకథ చివరకు వివాహంతో ముగిసింది. 2024 డిసెంబర్ 12న గోవాలో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం వైభవంగా జరిగింది.

ఇక సినిమాల విషయానికి వస్తే, కీర్తి సురేష్ ఇటీవల 2025లో విడుదలైన ‘రివాల్వర్ రీటా’ సినిమాలో కనిపించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె రిషి శివకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తోట్టమ్’ సినిమాలో ఆంటోనీ వర్గీస్‌తో కలిసి నటిస్తోంది. వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన కీర్తి, ప్రొఫెషనల్‌గా కూడా కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Latest News