Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంతిమయాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. 9 గంటల వరకు అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం పవార్ డెడ్‌బాడీని కాటేవాడిలో ఆయన ఇంట్లో ఉంచనున్నారు. అనంతరం జీడీఎం ఆడిటోరియంకు తరలించనున్నారు. ఉదయం 11 గంటలకు బారామతిలోని విద్య ప్రతిష్ట్‌స్థాన్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతిమయాత్రకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అజిత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అజిత్ పవార్ అంత్యక్రియల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, మంత్రివర్గంతో పాటు ఎన్సీపీ నాయకత్వం, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు.
అజిత్ పవార్ మరణవార్తను ఆయన అభిమానులు, ఎన్సీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాను కోల్పోయామని కన్నీరు పెట్టుకుంటున్నారు. లాంగ్ లివ్ అజిత్ దాదా, కమ్ బ్యాక్ అజిత్ దాదా అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు.
