న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కార్యాలయం(PMO Building ) భవనం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది(Renamed). పీఎంవో భవనం పేరును ‘సేవాతీర్థ్’(Seva Tirth)గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు గవర్నర్ల అధికారిక నివాసం రాజ్‌భవన్‌ను సైతం లోక్‌భవన్(Lok Bhavan)గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇప్పటికే సూచించింది. అలాగే లెఫ్గ్ నెంట్ గవర్నర్ ల నివాసాల పేర్లను రాజ్ నివాస్ లకు బదులుగా లోక్ నివాస్( Lok Nivas)గా మార్చాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు లేఖలు రాసింది.
బ్రిటీష్ వలస వాద వాసనలను తొలగించేందుకు..ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటేందుకు ఈ పేర్ల మార్పును చేస్తున్నట్లుగా కేంద్రం పేర్కొంది. కేంద్రం సూచనలతో ఇప్పటికే పశ్చిమబెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒరిస్సా రాష్ట్రాల రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌లుగా మార్చారు.
