Reels | రీల్స్ కోసం ర‌ద్దీ రోడ్డుపై క‌దులుతున్న వాహ‌నాల డోర్లు తీస్తూ.. బైక‌ర్ ప్ర‌మాద‌క‌ర స్టంట్స్‌

ఢిల్లీ (Delhi)కి చెందిన 22 ఏళ్ల తుషార్ పునియా అనే యువ‌కుడు ర‌ద్దీ ర‌హ‌దారిపై బైక్‌తో ప్ర‌మాద‌క‌ర స్టంట్స్ (Biker dangerous stunts) ప్ర‌ద‌ర్శించాడు. ర‌ద్దీ ర‌హ‌దారి (busy road)పై క‌దులుతున్న వాహ‌నాల డోర్లు (doors of moving vehicles) తీస్తూ ప్ర‌యాణికుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేశాడు.

Biker dangerous stunts

Reels | సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యేందుకు కొంద‌రు ప్రమాద‌క‌ర స్టంట్స్ చేస్తున్నారు. వారు చేసే ప‌నులు ఇత‌రుల‌ను కూడా ప్ర‌మాదాల్లోకి నెడుతున్నాయి. తాజాగా రీల్స్ (Reels) కోసం ఓ బైక‌ర్ ర‌ద్దీ ర‌హ‌దారి (busy road)పై క‌దులుతున్న వాహ‌నాల డోర్లు (doors of moving vehicles) తీస్తూ ప్ర‌మాద‌క‌ర స్టంట్స్ (Biker dangerous stunts) ప్ర‌ద‌ర్శించాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)కి చెందిన 22 ఏళ్ల తుషార్ పునియా త‌ర‌చూ రీల్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. రీల్స్ చేసే క్ర‌మంలో అత‌డు స్థానికుల‌కు అసౌక‌ర్యం క‌లిగించే వాడు. తాజాగా అత‌డు అలాంటి ప‌నేచేశాడు. ఢిల్లీలోని ర‌ద్దీ ర‌హ‌దారిపై బైక్‌పై ప్ర‌యాణిస్తూ.. అటుగా వెళ్తున్న బ‌స్సులు, ఆటోలు వంటి వాహ‌నాల డోర్లు తీస్తూ అంద‌రినీ భ‌య‌బ్రాంతుల‌కు గురి చేశాడు. ఆర్టీసీ బ‌స్సుల‌కు ఎదురుగా వెళ్లి బైక్‌ను ఆప‌డం వంటి ప‌నులు చేశాడు.

అత‌డి చ‌ర్య‌ను కొంద‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైర‌ల్‌గా మారి పోలీసుల దృష్టికి చేరింది. ఇంకేముందు రంగంలోకి దిగిన పోలీసులు న‌డిరోడ్డుపై ప్ర‌మాద‌క‌ర స్టంట్స్ చేస్తూ.. ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసిన తుషార్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతనిపై ర్యాష్ డ్రైవింగ్ (బీఎన్ఎస్ 281), ఇత‌రుల భ‌ద్ర‌త‌కు హాని క‌లిగించ‌డం (బీఎన్ఎస్ 125) వంటి సెక్ష‌న్లకింద కేసు న‌మోదుచేశారు.

ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అత‌డు నిత్యం ఇలాంటి స్టంట్లే చేస్తూ ప్ర‌యాణికుల‌ను, వాహ‌న‌దారుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది. ఇలా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ప్ర‌మాద‌కర స్టంట్స్ చేస్తూ ఇత‌రుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు.

 

ఇవి కూడా చదవండి :

Photographer | అద్దె ఇంటికోసం వెళ్లి.. షూర్యాక్‌లో ఉన్న తాళంతో రూ.55 ల‌క్ష‌ల విలువైన న‌గ‌లు చోరీ చేసిన ఫొటోగ్రాఫ‌ర్‌
Ibrahimpatnam Municipal Elections | ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికపై స్టే ఎత్తివేత

Latest News