Ibrahimpatnam Municipal Elections | ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికపై స్టే ఎత్తివేత

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికపై హైకోర్టు స్టే ఎత్తివేత. కౌన్సిలర్ యాదగిరి కేసులో స్వేచ్ఛగా ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు, భద్రత కల్పించాలన్న సూచనలు.

Ibrahimpatnam Municipal Elections | ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికపై స్టే ఎత్తివేత

విధాత, హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికపై విధించిన స్టేను తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఎత్తివేసింది. చైర్ పర్సన్ ఎన్నికలను స్వేచ్చగా నిర్వహించాలని ఆదేశించింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి కిడ్నాప్ వివాదంపై ఆయన కుమారులు హైకోర్టులో దాఖలు చేసిన హేబియస్ కార్పోరేషన్ పిటిషన్ పై బుధవారం విచారణ కొనసాగింది. యాదగిరిని పోలీసులు హైకోర్టు జడ్జి ముందు హాజరుపర్చారు.

బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్ రెడ్డి మనుషులు తనని బలవంతంగా తీసుకెళ్లారని ఈ సందర్బంగా యాదగిరి జడ్జికి వివరించాడు. కౌన్సిలర్ల ఎన్నికల ఫలితాలు వచ్చాక బలవంతంగా తనను చీరాల తీసుకళ్లారని, తనను రెండు రోజులు రిసార్ట్ లోనే ఒంటరిగా ఉంచారని ఆకుల యాదగిరి తెలిపాడు. బెదిరించి ప్రలోభపెట్టి తనతో బలవంతంగా ఓటు వేయించుకున్నారని పేర్కొన్నాడు. ఎన్నికలు న్యాయబద్దంగా నిర్వహించాలని కోరాడు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం యాదగిరిని మానసికంగా, శారీరకంగా వేధించినట్లుగా భావిస్తున్నామని, చైర్ పర్సన్ ఎన్నిక స్వేచ్చగా జరుగలేదని, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది. తిరిగి స్వేచ్చగా ఎన్నిక ప్రక్రియ నిర్వహించాలంటూ గతంలో విధించిన స్టేను ఎత్తివేసింది. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ దే తుది నిర్ణయమని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు యాదగిరికి రక్షణ కల్పిస్తామని హైకోర్టు పేర్కొంది.

అంతకుముందు సోమవారం జరుగాల్సిన ఇబ్రహీం పట్నం చైర్ పర్సన్ ఎన్నిక యాదగిరి అదృశ్యంతో మంగళవారానికి వాయిదా పడింది. యాదగిరి అదృశ్యంపై ఆయక కుమారులు హైకోర్టును ఆశ్రయించగా..హైకోర్టు ఎన్నిక నిర్వహణపై 19వరకు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. స్టే ఉత్తర్వులు ఎన్నికల అధికారులకు అందే సమయానికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి టేకు సుదర్శన్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే, హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. స్టే కారణంగా బీఆర్‌ఎస్‌ ఛైర్మన్‌ అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. తాజాగా స్టే ఎత్తివేసి చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించడంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది ఆసక్తికంగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో 7 కార్పోరేషన్లు, 116మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మొత్తం 90 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లను హస్తగతం చేసుకుంది. బీఆర్ఎష్ 19 మున్సిపాల్టీలన​ గెలవగా, కరీంనగర్​ కార్పొరేషన్, నారాయణ పేట మున్సిపాలిటీని బీజేపీ గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి :

Wedding | మ‌రికాసేప‌ట్లో పెళ్లి.. అక్క‌డే అస‌లు ట్విస్ట్‌.. వ‌రుడు అస‌లు అబ్బాయే కాదు..
Dolphins | కొంక‌ణ్ తీరంలో అరుదైన దృశ్యం.. ఒకేసారి 75 డాల్ఫిన్లు క‌నువిందు