న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి గా సీపీ రాధాకృష్ణన్ప్ర మాణ స్వీకారం చేశారు (CP Radhakrishnan Takes Oath). రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాధాకృష్ణన్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతులు జగదీప్ ధన్ ఖడ్, ఎం.వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎన్డీయే కూటమి నేతలు హాజరయ్యారు.
తాజా మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో నిర్వహించిన నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఇండియా కూటమి అభ్యర్థి జస్జీస్ సుదర్శన్ రెడ్డిపై 152ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో రాధాకృష్ణన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు మహారాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అప్పగించారు.