Bomb Threat To CP Radhakrishnan | ఉప రాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపులు

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చెన్నై నివాసంలో బాంబు అమర్చినట్లు డీజీపీ కార్యాలయానికి మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇది అవాస్తవమని తేలింది.

Bomb threat to Vice President C P Radhakrishnan Read more at: https://www.deccanherald.com/india/tamil-nadu/bomb-threat-to-vice-president-c-p-radhakrishnans-chennai-residence-likely-a-hoax-police-3767342

న్యూఢిల్లీ : చైన్నైలోని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఉప రాష్ట్రపతి నివాసంలో బాంబు అమర్చినట్లు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బంది ఆయన ఇంటికి చేరుకొని తనిఖీలు చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని అధికారులు తెలిపారు.

దీంతో బాంబు బెదిరింపు.. అంతా ఉత్తదేనని నిర్ధారించారు. బాంబు బెదిరింపు ఈ మెయిల్‌ పంపిన వారిని పట్టుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తమిళనాడులో కొన్ని రోజులుగా ప్రముఖుల ఇళ్లు, ప్రధాన కార్యాలయాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండటం పోలీసులకు తలనొప్పిగా తయారైంది.