OTT Movies | ఫిబ్రవరి మూడో వారం ఓటీటీ, థియేటర్ రిలీజ్‌లు .. చిన్న సినిమాల సందడితో పాటు వెబ్ సిరీస్‌ల హడావిడి

OTT Movies | మరో కొత్త వారం వచ్చేసింది. ఈ వారం కూడా థియేటర్లలో పెద్ద స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడం లేదు. అయితే చిన్న, మధ్యతరహా చిత్రాలు మాత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ‘హే భగవాన్’, ‘నవాబ్ కేఫ్’, ‘త్రిశంకు’ వంటి తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.

OTT Movies | మరో కొత్త వారం వచ్చేసింది. ఈ వారం కూడా థియేటర్లలో పెద్ద స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడం లేదు. అయితే చిన్న, మధ్యతరహా చిత్రాలు మాత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ‘హే భగవాన్’, ‘నవాబ్ కేఫ్’, ‘త్రిశంకు’ వంటి తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. హిందీ చిత్రాల విషయానికి వస్తే మృణాల్ ఠాకూర్ నటించిన ‘దో దివానే సెహర్ మైన్’, తాప్సీ నటించిన ‘అస్సీ’ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఇక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రం ఈ వారం మంచి కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ‘శ్రీ చిదంబరంగారు’ సినిమా తక్కువ గ్యాప్‌లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అలాగే డబ్బింగ్ చిత్రాలు, ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌లు కూడా ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇంకా ఓటీటీలోకి రాకపోయినా, ఎప్పుడైనా సడన్ ఎంట్రీ ఇచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పుడు ఫిబ్రవరి మూడో వారంలో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్:

మై పెంగ్విన్ ఫ్రెండ్ (హిందీ డబ్బింగ్ సినిమా) – ఫిబ్రవరి 16

ద లెటర్ ఆఫ్ ద డే (ఇంగ్లిష్ మూవీ) – ఫిబ్రవరి 16

స్కిన్ కేర్ (ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 16

వైట్ బర్డ్ (ఇంగ్లిష్ మూవీ) – ఫిబ్రవరి 16

చథా పచ్చ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఫిబ్రవరి 19

ద నైట్ ఏజెంట్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 19

స్ట్రిప్ లా (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 20

అమెజాన్ ప్రైమ్ వీడియో

హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) – ఫిబ్రవరి 20

56 డేస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 18

ఈటీవీ విన్

శ్రీ చిదంబరంగారు (తెలుగు సినిమా)

జియో హాట్ స్టార్

లక్కీ: ద సూపర్‌స్టార్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 20

ఆహా

హాట్‌స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) – ఫిబ్రవరి 20

జీ 5

కెన్నడీ (హిందీ సినిమా) – ఫిబ్రవరి 20

యాపిల్ టీవీ +

ద లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ – సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 19

ల‌య‌న్స్ గేట్ ప్లే

హీటెడ్ రైవల్రీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 20

మొత్తంగా ఈ వారం థియేటర్ల కంటే ఓటీటీల్లోనే ఎక్కువ హడావిడి కనిపిస్తోంది. చిన్న సినిమాలు థియేటర్లలో అదృష్టం పరీక్షించుకోగా, వెబ్ సిరీస్‌లు మరియు డబ్బింగ్ మూవీస్ ఓటీటీ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాయి.

Latest News