Site icon vidhaatha

MLC Kavitha : ఎమ్మెల్సీ పదవికి..పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!

BRS MLC Kavitha

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కు గురైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు..ఎమ్మెల్సీ కవిత ఆ పార్టీ నుంచి పూర్తిగా తెగతెంపులు చే సుకునేందుకు నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నందునా తన ఎమ్మెల్సీ పదవికి..పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కవిత భావిస్తున్నారు. ఇంకాసేపట్లో దీనిపై కవిత అధికారిక ప్రకటన చేయనున్నారు. ఎమ్మెల్సీ పదవి పై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే ఆ పదవిని వదులుకోవాలని కవిత నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామాతో పాటు బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసిన పరిణామాలపై కవిత మీడియాతో మాట్లడబోతుండటంతో కవిత స్పందన సర్వత్రా ఆసక్తి నెలకొంది. మీడియా సమావేశంలో కవిత తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ కూడా ప్రకటించవచ్చని సమాచారం.

Exit mobile version