Site icon vidhaatha

COVID-19 | కరోనా విజృంభణ.. 37వేలు దాటిన యాక్టివ్‌ కేసులు.. మరోసారి ఆంక్షలు తప్పవా..?

COVID-19 | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. పెరుగుతున్న కొవిడ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు మాస్క్‌ తప్పని సరి చేస్తూ ఆదేశాలు ఇచ్చాయి. తాజాగా గడిచిన 24గంటల్లో 5,676 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 3,361 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 4,47,68,172కు చేరగా.. ఇందులో 4,42,00,079 మందులు కోలుకున్నారు. కొవిడ్‌తో కొత్తగా 21 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,31,000కు చేరింది. ప్రస్తుతం దేశంలో 37,093 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.08శాతం ఉన్నాయని, రికవరీ రేటు 98.73 ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.88 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 3.81శాతం ఉందని పేర్కొంది. గత 24 గంటల్లో 1,96,796 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించామని.. ఇప్పటి వరకు 92.30 కోట్లు టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. మరో వైపు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 220.66 డోసులు వేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ సోమవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించింది. మంగళవారం సైతం మాక్‌ డ్రిల్‌ కొనసాగనున్నది. 7న జరిగిన సమీక్ష సమావేశంలో ఆసుపత్రుల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్యమంత్రులను కోరిన విషయం తెలిసిందే.

Exit mobile version