Free Bus | ఫ్రీ బస్సును ఇలా కూడా వాడేస్తున్నారా.. బస్సులోనే బ్రష్ చేసిన మహిళ.. వీడియో వైరల్

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో మహిళ బ్రష్ చేస్తూ కనిపించిన వీడియో వైరల్‌గా మారింది. కండక్టర్ ప్రశ్నించగా “అంతా ఫ్రీ” అంటూ ఆమె నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది.

free bus

Free Bus | ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పటి నుంచి చిత్రవిచిత్రాలను చూస్తూనే ఉన్నాం.. సీట్ల కోసం గొడవలు, టైమ్‌పాస్ కోసం ఫ్రీ బస్సు ఎక్కడం.. ఇలా నిత్యం ఏదో ఒక లొల్లితో తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళ ఏకంగా బస్ ఎక్కి బ్రష్ చేస్తూ కనిపించింది. ఇది గమనించి కండకర్ట్ ప్రశ్నించినప్పటికీ.. అంతా ఫ్రీ అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం గమనార్హం. నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లా పదరా మండలం మద్దిమడుగు వైపు నుంచి అచ్చంపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళ కిటికీ పక్కన కూర్చొంది. ఉదయం పూట బస్సు ఖాళీగా ఉండటంతో అందులోనే బ్రష్ చేసుకుంది. పళ్లు తోముకుంటూ కిటికీలో నుంచి బయటకు ఉమ్మివేసింది. ఇది చూసి తోటి ప్రయాణికులు షాకయ్యారు. మహిళా కండక్టర్ కూడా ఇది గమనించి, సదరు మహిళను నిలదీసింది. బస్సులోనే బ్రష్ చేసుకుంటారా? అని అడిగింది. కానీ కండక్టర్ మాటను మహిళ ఏ మాత్రం పట్టించుకోలేదు కదా.. అంతా ఫ్రీ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఫ్రీ అయితే బస్సులోనే బ్రష్ చేయమన్నారా అని అడగ్గా.. ” అరె రామశంకరా.. నేను ఛాయ్ కూడా తాగాలి.. బస్సు ఆపుతావా ” అని వ్యంగ్యంగా ప్రశ్నించింది. సదరు మహిళ తీరు చూసి తోటి ప్రయాణికులు కూడా ఆశ్చర్యపోయారు.

ఈ క్రమంలోనే మహిళ బ్రష్ చేస్తుండగా తోటి తమ మొబైల్‌లో వీడియోలు తీశారు. వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి :

Naga Chaitanya | వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్‌లో ప్రమాదం.. కుర్చీ విరిగి కింద‌పడిన నాగచైతన్య, అభిమానుల్లో కలకలం
Realme | రేపే మార్కెట్‌లోకి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. చీప్ అండ్ బెస్ట్‌ మొబైల్ కొనాలని చూసేవాళ్లకు బెస్ట్ ఆప్షన్!

Latest News