Naga Chaitanya | వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్‌లో ప్రమాదం.. కుర్చీ విరిగి కిందపడిన నాగచైతన్య, అభిమానుల్లో కలకలం
Naga Chaitanya | టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వృషకర్మ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ IMAX PCXలో గురువారం ఘనంగా నిర్వహించారు.
Naga Chaitanya | టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వృషకర్మ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ IMAX PCXలో గురువారం ఘనంగా నిర్వహించారు. అయితే కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్న సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకోవడంతో అక్కడికొచ్చిన అభిమానులు, మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
గ్లింప్స్ విడుదల అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు వేదికపై మాట్లాడారు. అనంతరం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికోసం వేదికపై కుర్చీలు ఏర్పాటు చేశారు. మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి నాగచైతన్య ఒక కుర్చీలో కూర్చోగానే అది అకస్మాత్తుగా వెనక్కి వంగిపోయింది. దీంతో ఆయన బ్యాలెన్స్ కోల్పోయి ఒక్కసారిగా కిందపడిపోయారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న చిత్రబృందం, మీడియా సభ్యులు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా తలకు లేదా వీపుకు ఏమైనా గాయాలు అయ్యాయేమోనని అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందారు. అయితే వెంటనే తేరుకున్న నాగచైతన్య పక్కనే ఉన్న దర్శకుడు కార్తీక్ దండు సహాయంతో లేచి నిలబడ్డారు. తనకు ఏమీ కాలేదని సంకేతం ఇస్తూ అందరినీ ధైర్యం చెప్పారు.
ఆ తర్వాత సిబ్బంది మరో కుర్చీని తీసుకురాగా, అందులో కూర్చుని నాగచైతన్య కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే ఇంత పెద్ద ఈవెంట్‌లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ తన అసౌకర్యాన్ని పక్కన పెట్టి మీడియా అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ, “వృషకర్మ ఒక విభిన్నమైన థ్రిల్లర్ కథతో తెరకెక్కుతోంది. దర్శకుడు కార్తీక్ దండు మేకింగ్ స్టైల్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా అక్కినేని అభిమానులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది” అని తెలిపారు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాగచైతన్యకు ఏమీ కాలేదని తెలుసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. “కిందపడినా వెంటనే తేరుకుని నవ్వుతూ కార్యక్రమాన్ని కొనసాగించడం ఆయన సరళతకు నిదర్శనం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ‘వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్‌లో జరిగిన ఈ చిన్న ప్రమాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే నాగచైతన్య ధైర్యంగా స్పందించి కార్యక్రమాన్ని కొనసాగించడం అభిమానులను ఆకట్టుకుంది.
Time to leave the country & start a new life bro @chay_akkineni 😭 pic.twitter.com/YObX6OmiKU
— Minnu Maawa ᴱᶜᶠ (@minnumaawa) March 5, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram