విధాత: “ఆ నలుగురు” చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకుని, “పెళ్లయిన కొత్తలో” చిత్రంతో దర్శకుడిగా మారిన “మదన్” ఆకస్మిక మరణం చెందారు.
నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన మదన్.. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ… కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
ఆయన స్వస్థలం మదనపల్లి కాగా “గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి” వంటి చిత్రాలకు మదన్ దర్శకత్వం వహించారు.