Site icon vidhaatha

Gold Rates | బంగారం ధర తగ్గిందోచ్‌..! హైదరాబాద్‌లో నేడు పసిడి ధరలు ఇవే..!

Gold Rates | ఇటీవల బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు పైపైకి కదులుతున్నాయి. దాంతో బంగారమంటేనే బాబోయ్‌ అనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, తాజాగా పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటిచ్చాయి. బుధవారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.390 తగ్గి తులానికి రూ.60,350కి చేరింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.420 తగ్గి.. తులం రూ.65,840కి తగ్గింది. మరో వైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.61,480 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.67,080కి పతనమైంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.60,350 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.65,840కి తగ్గింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.60,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.65,990కి దిగివచ్చింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.60,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.65,840 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.100 పెరిగి కిలో ధర రూ.76,200కు ఎగిసింది. హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.79,600 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version