Site icon vidhaatha

Good News | త్వ‌ర‌లో DSC .. టెట్ నిర్వ‌హ‌ణ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం..!

Good News | DSC

రాష్ట్రంలోని బీఈడీ, డీఈడీ చేసిన అభ్య‌ర్థుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించ‌నుంది. టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి డీఎస్సీ వేసేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ క్ర‌మంలో మ‌రోసారి టెట్ (ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌) నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఇవాళ విద్యాశాఖ‌పై స‌మావేశ‌మైన మంత్రివ‌ర్గ ఉప‌సంఘం భేటీలో ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ కేబినెట్ స‌బ్ క‌మిటీ భేటీలో ఉపాధ్యాయ ఖాళీల భ‌ర్తీ, మన ఊరు – మ‌న బ‌డిపై చ‌ర్చించారు. చివ‌రిసారిగా టెట్‌ను గ‌తేడాది జూన్ 12వ తేదీన నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

బిఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురుగా అందింది. వీలైనంత త్వరలో టెట్ నిర్వహించాలని ఇందుకు మరోసారి భేటీ కావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

Exit mobile version