Site icon vidhaatha

ఉత్కంఠపోరులో.. పాకిస్థాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

విధాత, క్రికెట్‌: టీ 20 ప్రపంచ కప్ దాయాది జట్టు పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ విజయభేరీ మోగించింది. క్రికెట్ చరిత్రలోనే ఇంతటి థ్రిలింగ్ మ్యాచ్ జరిగి ఉండదు. నరాలు తెగిపోయే ఉత్కంఠ అంటే ఇదే.

భార‌త్ గెలిచింది.. మాజీ క్రికెట‌ర్లు గంతేశారు

ఒక్కో బంతి పడుతుంటే గుండె ఆగిపోతున్న ఫీలింగ్. బంతి పడ్డాక దానికంటే వేగంగా కొట్టుకునే గుండె.. వెరసి భారత్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన విజయం. ప్రత్యేక్షంగా వేలాదిమంది, టీవీల్లో కోట్లాది మంది.. ఒక్క హాట్‌స్టార్‌లోనే కోటిన్నర మంది వీక్షించిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ దేశానికి ఒక రోజు ముందే దీపావళి తీసుకొచ్చింది.

Exit mobile version