విధాత: ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే విజయం సాధించారు. అందరూ ఊహించిన విధంగానే ఖర్గే భారీ మెజారిటీతో గెలిచారు. మొత్తం 9, 300 పైగా ఉన్న ఓట్లలో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశిథరూర్‌కు వెయ్యి ఓట్లు వచ్చాయి. అధ్యక్ష ఎన్నికల్లో 416 ఓట్లు అనర్హతకు గురయ్యాయి.
ఎన్నిక కోసం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ప్రతి నియోజకవర్గానికి ఇద్దరి చొప్పున ఓటర్లుగా ఉండేవిధంగా మొత్తం 9,300 మందిని ఎంపిక చేసింది. అలాగే పెద్దస్థాయి మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాలు, రాష్ట్ర కేంద్రం, ఏఐసీసీ ముఖ్య కేంద్రం నుంచి మరికొంతమందిని ఓటర్లుగా ఎంపిక చేసింది.
మొన్న జరిగిన పోలింగ్‌లో 97 శాతానికి పైగా పీసీసీ ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే. 137 కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరు సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. సుమారు 22 ఏళ్లు పాటు సోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఏకభిప్రాయంతో రాహుల్‌గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
ఆ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగారు. నాటి నుంచి నేటి వరకు సోనియాగాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవల పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, వరుస వైఫల్యాలు, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పోరు, రాహుల్ నాయకత్వంపై విమర్శలు వచ్చాయి. వీటన్నింటి దృష్ట్యా తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోనని రాహుల్ స్పష్టం చేశారు.
గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్షుడిగా ఉండబోరని రాహుల్ ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు అనుగుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సీనియర్ నేత మధుసుదన్ మిస్త్రీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈ పోలింగ్ ప్రకియను నిర్వహించింది. ఉదయం 10 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.
రిటర్నింగ్ అధికారులు, సహార రిటర్నింగ్ అధికారులగా బాధ్యతలు నిర్వహించిన వారే కౌంటింగ్‌లో పాలుపంచుకున్నారు. అన్ని రాష్ట్రంలో ఓట్లను సేకరించి ఇవాళ జరిపిన లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఈ ఎన్నికల్లో భారీ మోజారిటీతో మల్లిఖార్జున ఖర్గే ఘన విజయం సాధించారు.