Site icon vidhaatha

KTR | నాడైనా నేడైనా.. కరీంనగర్‌ గడ్డ.. గులాబీ అడ్డ : కేటీఆర్‌

KTR | నాడైనా.. నేడైనా.. ఏనాడైనా కరీంనగర్‌ గడ్డ.. గులాబీ అడ్డా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కరీంనగర్‌ కదనభేరి సభ విజయవంతం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్‌(ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు. ‘కరీంనగర్ కదనభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అశేషంగా తరలివచ్చిన ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాడు అయినా.. నేడు అయినా.. ఏనాడైనా.. కరీంనగర్ గడ్డ.. గులాబీ అడ్డ. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గారి గెలుపు ఖాయమని ఈ సభతో తేలిపోయింది. గులాబీ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపిల గుండెల్లో గుబులు మొదలైంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

కరీంనగర్‌ సభకు కేటీఆర్‌ దూరమైన విషయం తెలిసిందే. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని.. దాంతో సభకు హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని.. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్‌ కళాశాల మైదానంలో కరీంనగర్‌ కదనభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు భారీగా జనం తరలివచ్చారు. సభకు హాజరైన ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీ తీరును ఎండగట్టారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Exit mobile version