Site icon vidhaatha

Pratibha Patil | ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌..

Pratibha Patil | మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతిలో ఇన్ఫెక్షన్‌ కారణంగా మహారాష్ట్ర పుణేలోని ఓ ఆసుపత్రిలో బుధవారం అడ్మిట్‌ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ‘మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆమె జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతోంది. ఆమె ఆరోగ్యంగా ఉంది. చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్యుల పరిశీలనలో ఉన్నారు’ అని ఆసుపత్రి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రతిభా పాటిల్‌ భారతదేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా సేవలందించారు. 2007-2012 వరకు రాష్ట్రపతిగా కొనసాగారు.

Exit mobile version