Site icon vidhaatha

Breaking News ; ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలిక బ్రేక్‌.. ఎందుకంటే..

ప్రజా సమస్యలను నేరుగా ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు ఉద్దేశించి ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలిక బ్రేక్‌ పడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు నేరుగా ప్రభుత్వాన్ని కలుసుకుని, తమ సమస్యలు చెప్పుకొనేందుకు వీలు కల్పించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు నోడల్‌ అధికారి తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే.. జూన్‌ ఏడో తేదీన ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. 

Exit mobile version