ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అతిరథ మహారథుల సమక్షంలో ప్రీ-వెడ్డింగ్ వేడుకులను జరుపుకుంటోంది అంబానీ ఫ్యామిలీ.మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ మార్చి 3 వరకు జరగనుండగా, ఈ వేడుకలలో పలువురు సెలబ్రిటీలు తెగ సందడి చేస్తున్నారు. పాప్ సింగర్ రిహాన్న తన ప్రదర్శనతో ఊర్రూతలూగించగా.. ఆమెకు కోట్లలో రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం.
మరోవైపు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ ఈవెంట్‌లో రచ్చ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకి ఖాన్ త్రయం అయిన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్,షారూఖ్ ఖాన్ తమదైన స్టైల్‌లో డ్యాన్స్ చేయడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత ఒకే స్టేజ్ పై ముగ్గురు స్టార్స్ ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేయడం ప్రతి ఒక్కరికి కనుల విందుగా మారింది. ముఖ్యంగా నాటు నాటు పాటకి వారు డ్యాన్స్ చేయడం విశేషంగా మారింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన సిగ్నేచర్ స్టేప్ ను మార్చేసి కాసేపు నవ్వులు పూయించాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ఖాన్ త్రయం చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంబాని ఇంట జరుగుతున్న పెళ్లి వేడుకలలో భాగంగా మొదటి రోజు జమ్నా నగర్ ప్రాంత ప్రజలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించాడు అంబానీ. ఈ కార్యక్రమంలో దాదాపు 20వేలకు పైగా పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇక రెండో రోజు శనివారం ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరగగా, ఈ వేడుకలో అనంత్ అంబాని మాట్లాడిన మాటలు ముఖేశ్ అంబానికి కన్నీళ్లు తెప్పించాయి. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు.. తన ఫ్యామిలీ సపోర్ట్ గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడి ముఖేష్ కంట కన్నీరు తెప్పించాడు. ఇక ఈ వేడుకలకి బిల్ గేట్స్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకొణే, రణవీర్ సింగ్, రామ్ చరణ్, ఎంఎస్ ధోని, సచిన్ తదితరులు పాల్గొన్నారు.
Naacho naacho naacho naacho ⁰Naacho naacho yaara naacho…