Sickle Cell Disease | సికిల్‌ సెల్‌ అనీమియా నిర్మూలనలో భారీ విజయం..! మెడిసిన్‌ ధరను తగ్గించిన కంపెనీ..!

  • Publish Date - March 19, 2024 / 02:56 AM IST

Sickle Cell Disease | ప్రపంచవ్యాప్తంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో సికిల్‌ సెల్‌ అనీమియా ఒకటి. భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఓ అంచనా ప్రకారం.. ఈ సికిల్‌ తీవ్రమైన సమస్య కాగా.. ఏడుకోట్ల మందికిపైగా గిరిజనుల్లో సమస్యను గుర్తించారు. దీన్ని ప్రమాదాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గతేడాది బడ్జెట్‌లో 2047 నాటికి భారత్‌ నుంచి సికిల్‌ వ్యాధిని నిర్మూలించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నది. 2023 జూలైలో మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ 2047కి శ్రీకారం చుట్టారు. అయితే, ఈ వ్యాధి నిర్మూలన దిశగా దేశం భారీ విజయాన్నే సాధించింది. భారత్‌కు చెందిన ఓ కంపెనీ సికిల్‌కు మందును తయారు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్రం మిషన్‌

సికిల్‌ వ్యాధి నివారణకు ఓ ఔషధాన్ని అభివృద్ధి చేసినందుకు అభినందనలు అంటూ కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పీఎం మోదీ 2023లో సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్‌ను ప్రారంభించారు. ఈ మెడిసిన్‌ ముఖ్యంగా గిరిజనులకు, పిల్లలకు ఓ వరమని నిరూపితమవుతుందని.. త్వరలోనే వ్యాధి నుంచి బయటపడగలమన్నారు. గతంలో మందుల తయారీ కంపెనీAKUMS దేశంలోని తొలిసారిగా దేశీయ హైడ్రాక్సీయూరియా ఓరల్ సొల్యూషన్‌ను తీసుకువచ్చినట్లు ప్రకటించింది. ఇది పిల్లలలో సికిల్ సెల్ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మెడిసిన్‌ ధరను భారీగా తగ్గించింది. ఈ మెడిసిన్‌ కోసం ప్రభుత్వానికి రూ.600 ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెట్లలో ధరతో పోలిస్తే దాదాపు ఒక శాతం మాత్రమే. ప్రపంచమార్కెట్‌లో ఒక సీసా మందు ఖరీదు రూ.77వేలు ఉంటుంది. మెడిసిన్‌ను ప్రత్యేకంగా ఉంచాల్సి ఉంటుంది. మెడిసిన్‌ స్టోరేజ్‌ గదిలో ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ఇతర ఔషధాల నిల్వ కోసం 2-8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అవసరం. అయితే, కంపెనీ మార్కెట్‌లో ప్రస్తుత ధరను మాత్రం వెల్లడించలేదు. మందు ధర భారీగా తగ్గడంతో సికిల్‌ సెల్‌ నిర్మూలన మిషన్‌లో భారీగా విజయమని పలువురు ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

సికిల్‌ సెల్‌ వ్యాధి అంటే..?

సికిల్ సెల్ వ్యాధి అనేది వంశపారంపర్యంగా వచ్చే రక్త రుగ్మత. జీవసంబంధమైన తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వారసత్వంగా వస్తుంటుంది. శరీరం హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడాన్ని సూచించే జన్యువులో మార్పు కారణంగా సికిల్ సెల్ వ్యాధి సోకుతుంది. సమస్య కారణంగా కొడవలి ఆకారాన్ని కలిగి ఉండే ఎర్ర రక్త కణాలు రక్తనాళాల్లో అడ్డంకులను కలిగిస్తాయి. ఆర్‌బీఎస్‌లను గట్టిగా.. జిగటగా చేసే అసాధారణ హిమోగ్లోబిన్ స్థాయి కారణంగా కొడవలి ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో ఎర్ర రక్త కణాలు వైకల్యం చెంది.. విచ్ఛిన్నమవుతాయి. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండడంతో సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అయితే. ఇది సికిల్ సెల్ తీవ్రమైన రూపం. అయితే, అలసటను కలిగిస్తుంది. సికిల్ సెల్ వ్యాధి ప్లీహాన్ని దెబ్బతీయడం ద్వారా సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించినట్లయితే.. మందులతో పాటు, చికిత్సకు రక్తమార్పిడి.. కొన్ని తీవ్రమైన పరిస్థితులలో, ఎముక మజ్జ మార్పిడి అవసరం అవుతుంది.

Latest News