సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత గారాల పట్టి సితార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హీరోగా మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో ..ఆయన కూతురు,గారాల పట్టి సితార ఘట్టమనేని కూడా అంతే… పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తనదైన టాలెంట్‌తో కూడా మహేష్ కూతురు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. సర్కారు వారి పాట ఆల్బమ్ ‘పెన్నీ’ ప్రమోషనల్ వీడియోలో కనిపించిన సితార వెండితెరపై ఇప్పటి వరకు కనిపించింది లేదు. గత కొంత కాలంగా సితార తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేయనుందని ప్రచారం జరుగుతోంది.
ఇక చిన్న ఏజ్‌లోనే అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన మొదటి భారతీయ స్టార్ట్ కిడ్‌గా కూడా నిలిచింది సితార. ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సితార. ఫోటో షూట్‌లో కూడా పాల్గొంది. సితార క్యూట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇక సితార ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్ కలిగి ఉంది. అంతేకాదు సితార, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వీడియోలని అందులో షేర్ చేస్తూ ఉంటుంది.
సితార యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే కాకుండా ఇంస్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇందులో ఇక తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలతో పాటు సితార తన తండ్రి సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక సితార తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ప్రమోషనల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే నెలకు సుమారుగా 30 లక్షల వరకు ఆదాయం అందుకుంటున్నారంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. చిన్న వయస్సులోనే సితార ఇంత ఆదాయం రాబడుతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఏదేమైన తండ్రికి తగ్గ కూతురు అంటూ పలువురు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.