మహేష్ బాబు పాటకు అదిరిపోయే స్టెప్పులతో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించిన సితార

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకొని ప్రేక్షకుల దగ్గర ప్రశంసలు అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలోని పాటలు మాత్రం ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నాయి. చిత్రంలోని పాటలకి ప్రతి ఒక్కరు తమదైన స్టైల్లో డ్యాన్స్ లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు తనయ సితారనే గుంటూరు కారం చిత్రంలోని సాంగ్‌కి స్టెప్పులేసి అదరగొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
మహేష్-నమ్రతల గారాలాపట్టి సితార పాప సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. చిన్న వయస్సులోనే సితార పాపకి స్టార్ ఇమేజ్ దక్కింది. అయితే చిన్నప్పటి నుండే డ్యాన్సింగ్ నేర్చుకుంటున్న సితార అప్పుడప్పుడు తన తండ్రి సినిమాలలోని పాటలకి డ్యాన్స్‌లు చేసి అలరిస్తూ ఉంటుంది. తాజాగా సితార ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘ట్రిప్పింగ్..ట్రిప్పింగ్’ పాటకి స్టెప్పులు వేయగా, అదరహో అనిపిస్తున్నాయి. ఆమె ఎనర్జీని చూసి సితార రానున్న రోజులలో స్టార్ హీరోయిన్ కావడం ఖాయమని కొందరు జోస్యం చెబుతున్నారు.
ఇటీవల గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ జరగగా, ఆ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది సితార. శ్రీలీలతో క్యూట్ క్యూట్ పోజులిస్తూ తెగ సందడి చేసింది. సితార పిక్స్ అయితే నెట్టింట తెగ హల్చల్ చేశాయి. ఇక సితార విషయానికి వస్తే చిన్న వయసులోనే యూ ట్యూబ్ ఛానల్ రన్ చేయడంతో పాటు ఓ జ్యయలరీ సంస్ధకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ అందరి ప్రశంసలు అందుకుంటుంది. చిన్న వయస్సు నుంచే తండ్రి బాటలో నడుస్తూ తన గొప్ప మనస్సుని చాటుకుంటున్న సితారపై ఘట్టమనేని అభిమానులు అయితే తెగ ప్రశంసలు కురిపిస్తుంటారు.