‘ప్రజాపాలన’పై అసంతృప్తి ఎందుకు?
రైతులు సహా అన్ని వర్గాల వారికి అనేక రకాలుగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నప్పటికీ ప్రజల్లో ఏడాదిన్నరకే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపిస్తుండటం కాంగ్రెస్‌లో తీవ్ర అంతర్మథనానికి దారి తీసింది. ‘ప్రజా పాలన అని చెప్పుకుంటున్నాం.. మరి ప్రజలెందుకు దూరం అవుతున్నారు? లోపం ఎక్కడుంది? ఎందుకు సరిదిద్దడం లేదు’ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత నేతలే రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విధాత): రైతులు సహా అన్ని వర్గాల వారికి అనేక రకాలుగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నప్పటికీ ప్రజల్లో ఏడాదిన్నరకే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపిస్తుండటం కాంగ్రెస్‌లో తీవ్ర అంతర్మథనానికి దారి తీసింది. ‘ప్రజా పాలన అని చెప్పుకుంటున్నాం.. మరి ప్రజలెందుకు దూరం అవుతున్నారు? లోపం ఎక్కడుంది? ఎందుకు సరిదిద్దడం లేదు’ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత నేతలే రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్‌లో పీసీసీ విస్తృత స్తాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతపై ఏఐసీసీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ ముందే రాష్ట్ర నాయకత్వాన్ని పలువురు ప్రశ్నించారని విశ్వసనీయంగా తెలిసింది. ‘22 నెలల కాలంలో రూ. 99,500 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్నది. ఏ ప్రభుత్వం చేయని విధంగా పేద ప్రజలందరికీ సన్నబియ్యం ఇస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చట్టం చేశాం. బీసీ కులగణనతో దేశానికి ఆదర్శంగా నిలిచాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టం తెచ్చాం. రైతులను పట్టి పీడించిన ధరణి చట్టం స్థానంలో
అధికారులు రూపొందించిన గైడ్ లైన్స్ వల్లే
‘రైతులకు రూ.21,500 కోట్ల రుణమాఫీ చేశామని ప్రకటించుకున్నాం. కానీ గ్రామాలలో రుణమాఫీ సరిగా అమలు చేయలేదన్నఅభిప్రాయం రైతుల నుంచి వ్యక్తం అవుతున్నది’ అని ఒక నాయకుడు చెప్పారని సమాచారం. రుణమాఫీ అమలు కోసం అధికారులు రూపొందించిన గైడ్ లైన్సే బాగలేవని ఆయన అన్నారని తెలిసింది. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ ఏంటని ఒకింత అసహనంతో ఆయన ప్రశ్నించారని సమాచారం. కొంతమంది వ్యవసాయం చేయని భూ యజమానులకు రుణమాఫీ చేశారు కానీ, అలాంటి వారికి కాకుండా వ్యవసాయం చేసుకునే కుటుంబంలోని అందరికీ పాస్ బుక్‌ల ఆధారంగా రుణమాఫీ చేస్తే వ్యతిరేకత వచ్చేది కాదని సదరు నాయకుడు చెప్పినట్లు సమాచారం. అక్షరం తప్పున్నా రుణమాఫీ చేయలేదని, అధికారులు తయారు చేసిన గైడ్ లైన్సే ప్రజలు కాంగ్రెస్‌కు దూరం అయ్యేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వీటిని పరిశీలించి ప్రజలకు అనుగుణంగా మార్పులు చేయడంలో మనం విఫలమయ్యమని అంగీకరించాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం. అప్పటికే బీఆరెస్ కనుసన్నల్లో ఉన్న అధికారులు ఉద్దేశపూర్వకంగా ఈ గైడ్ లైన్స్ ఇచ్చారా? అన్న అనుమానాలు వస్తున్నాయని సదరు నాయకుడు అన్నారని
ప్రజా వ్యతిరేకతకు కారణమైన వ్యవసాయ శాఖ
వ్యవసాయ శాఖలో అధికారుల తీరే యూరియా కొరతకు కారణమన్న అభిప్రాయాన్ని సమావేశంలో కొందరు నాయకులు పార్టీ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిసింది. రైతు భరోసాతో ప్రభుత్వంపై వచ్చిన సానులకూల వాతావరణం యూరియా ఇవ్వలేకపోవడంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైందని అన్నారు. ‘కాలం చాలా అనుకూలంగా ఉంది. వర్షాలు విస్తారంగా కురిశాయి.. ఈ క్రమంలో రైతులకు కావాల్సిన యూరియాను సరఫరా చేయలేక పోవడంతో రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు’ అని మరొక నేత చెప్పినట్టు తెలిసింది. ఏటా కావాల్సినంత యూరియా రైతులకు అందుతున్నప్పుడు ఇప్పుడెందుకు ఇవ్వలేక పోయాం? ఒక్క మన పాలనలోనే యూరియా కొరత ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారని సమాచారం. అధికారులు మొదటి నుంచే ప్రణాళిక ప్రకారంగా సరఫరా చేస్తే ఈ ఇబ్బంది వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్టు చెబుతున్నారు. అధికారులే కావాలని మనపై రైతులు తిరగబడాలని చేస్తున్నారా? అన్న సందేహాలను కూడా పలువురు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
భూభారతితో మనం చేసిందేమిటి?
నాటి బీఆరెస్ పాలకులు ధరణితో భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించి ఆనాడు ధరణిని బంగాళా ఖాతంలో కలుపుతామని ప్రకటించాం.. మన ప్రభుత్వం వచ్చిన తరువాత ధరణి స్థానంలో భూ భారతి తెచ్చాం.. కానీ రైతుల సమస్యలు ఎందుకు పరిష్కరించలేక పోయామని కార్యకర్తలు నాయకత్వాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. భూ భారతిలో నిర్వహించిన రైతు సదస్సులలో అధికారులు చాలా చోట్ల దరఖాస్తులు తీసుకోలేదని, అన్నిచోట్ల దరఖాస్తులు తీసుకుంటే 8 లక్షలు కాదు.. 30 లక్షల వరకు వచ్చేవని అన్నారని సమాచారం. అయినా వచ్చిన 8 లక్షల దరఖాస్తులలో ఇప్పటి వరకు కేవలం 26 వేలే పరిష్కరిస్తారా? దీనిని పరిశీలిస్తే భూ సమస్యల పరిష్కారంలో మన చిత్తశుద్ది ఏమిటో అర్థం అవుతున్నది.. అంటూ ఒక నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. రెవెన్యూ అధికారులకు రైతుల సమస్యలు పరిష్కరం చేయాలన్న ఇష్టం లేదా.. లేక మనమే పరిష్కారం చేయవద్దని చెపుతున్నామా? అర్థం కావడం లేదని అన్నట్లు సమాచారం.
అధికారుల తీరుపైనా అనుమానాలు
పార్టీ అంతర్గత సమావేశంలో కొంతమంది నాయకులు అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పాలసీల్లో అధికారులు రూపొందిస్తున్న గైడ్ లైన్స్ ప్రజావ్యతిరేకతకు తావిచ్చేలా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘పార్టీ అధికారం చేపట్టి22 నెలలు అవుతున్నది. అంటే పాలనా కాలంలో 30 శాతం పూర్తయింది. 70 శాతం పాలనా కాలం ఉన్నా.. ఏడాది ముందు నుంచే ఎన్నికల వాతావరణం వస్తున్నది. దీంతో పాలనకు 45 శాతం సమయమే ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది’ అని సూచన చేసిన ఒక నాయకుడు.. ఇప్పటికైనా అగ్రనాయకత్వం పాలసీలను సమీక్షించి, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. అలాగే అధికారులు రూపొందించే గైడ్ లైన్స్ ప్రజలకు అనుకూలంగా ఉన్నాయా? లేవా అనేది కూడా చూడాలని చెప్పినట్లు సమాచారం.
సంక్షేమం అంతంతే..
సంక్షేమంపై చేవెళ్ల డిక్లరేషన్ అమలు కాకపోవడం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తున్నది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అందరికి రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 6 లక్షలు ఇస్తామని ప్రకటించి ఇవ్వకపోవడాన్నీ కొందరు ప్రశ్నించారని తెలిసింది. అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వాటిని సరిగ్గా అమలు చేయలేక పోవడంతో ఒక స్కీమ్‌లో వచ్చిన పాజిటివ్ వాతావరణం.. మరొకదానితో ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతున్నదని పార్టీ నాయకులు రాష్ట్ర నాయకత్వం ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.