Ravi Teja | ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తికర అప్డేట్ .. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Ravi Teja | మాస్ మహారాజా ర‌వితేజ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమకథా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు కిషోర్ తిరుమ‌ల‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరోయిన్లుగా డింపుల్ హ‌య‌తి, ఆషిక రంగ‌నాథ్ నటించగా, భీమ్స్ సిసిరోలియా సంగీతాన్ని అందించారు.

  • By: sn |    movies |    Published on : Mar 02, 2026 9:14 AM IST
Ravi Teja | ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తికర అప్డేట్ .. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Ravi Teja | మాస్ మహారాజా ర‌వితేజ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమకథా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు కిషోర్ తిరుమ‌ల‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరోయిన్లుగా డింపుల్ హ‌య‌తి, ఆషిక రంగ‌నాథ్ నటించగా, భీమ్స్ సిసిరోలియా సంగీతాన్ని అందించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, రిలేషన్ డ్రామా మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందు మంచి అంచనాలు రేకెత్తించింది. సంక్రాంతి సీజన్‌లో భారీ చిత్రాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను సంపాదించుకుంది. రవితేజకు ప్రత్యేకమైన ఎనర్జీ, కామిక్ టైమింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను కొంతవరకు అలరించాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి పరిమిత స్థాయిలో ఆదరణ లభించింది.

అయితే పండుగ సీజన్‌లో పెద్ద సినిమాల పోటీ కారణంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి వసూళ్లు రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయినప్పటికీ పాటలు, హీరోయిన్ల గ్లామర్, కొన్ని కామెడీ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. సినిమా విడుదలై రెండు నెలలు పూర్తవుతున్నా ఇంకా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం కాలేదు. దీంతో థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు డిజిటల్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటగా ఫిబ్రవరి 13న స్ట్రీమింగ్ ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ సాంకేతిక కారణాలతో అది వాయిదా పడింది. ఆ తర్వాత ఫిబ్రవరి 27, మార్చి 6 తేదీలు వినిపించాయి కానీ అధికారిక ప్రకటన వెలువడలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి డిజిటల్ హక్కులు దక్కించుకున్న ZEE5 మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజ రామ్ సత్యనారాయణ అనే వైన్ యార్డ్ యజమాని పాత్రలో కనిపిస్తాడు. తన ‘అనార్కలి’ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్పెయిన్‌కు వెళ్తాడు. అక్కడ ప్రముఖ వైన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌తో పరిచయం పెంచుకుని వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంటాడు.

అయితే అతని వ్యక్తిగత జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. భార్య బాలామణి అతనిపై ఎక్కువగా ఆధారపడే, పొసెసివ్ స్వభావం కలిగిన వ్యక్తి. ఇదే సమయంలో మరో మహిళతో ఏర్పడిన అనుబంధం రామ్ జీవితంలో సంక్లిష్ట పరిస్థితులను తీసుకొస్తుంది. ఇద్దరి మధ్య ఇరుక్కున్న హీరో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు? అన్నదే కథలో ప్రధానాంశం. భావోద్వేగాలు, కామెడీ, కుటుంబ సంబంధాల మధ్య జరిగే సంఘర్షణలను దర్శకుడు వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు.

థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌తో సరిపెట్టుకున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు అనువైన కంటెంట్ కావడంతో డిజిటల్ వేదికపై మరింత ఆదరణ లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.